శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : శనివారం, 20 డిశెంబరు 2014 (18:56 IST)

వాస్తు టిప్స్: ఒక ఇంటికి మూడు ద్వారాలుంటే.. దోషమా?

ఒక ఇంటికి మూడు ద్వారములుండుట దోషము. అనగా సింహద్వారముగాక ముఖభాగమునందు రెండు ద్వారములుండకూడదు. గృహమునకు మూడుదిశల ఖాళీస్థలముండి నాల్గోదిశయందు లేకుండుట దోషము. అనగా తూర్పు మొదలుకొని ఏదిశ యందలి సరిహద్దు మీద నుంచి అయినను గృహము నిర్మించ రాదు. 
 
పెంకుటిండ్లకు మూడువైపుల మాత్రమే వసారాలు వేయకూడదు. ముందు వెనుకలందుగానీ, నాల్గువైపులాగానీ వేయుట శుభము. డాబా ఇండ్లకు కూడా మూడువైపులా డాబావేసి నాల్గోవైపు పంచదించుట దోషము. అట్లే పెంకుటింటిని డాబాగా మార్పు చేయునప్పుడు మూడువైపుల డాబావేసి నాల్గోవైపు మార్చకుండా ఉండుట దోషము.