శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 29 మే 2015 (15:00 IST)

కొత్త కలపతో ఇళ్లు కడితే శుభమా?

కొత్తగా కట్టే ఇంటిని కొత్త కలపతో కట్టినచో సర్వ సౌఖ్యాలు కలుగుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. నూతనంగా నిర్మించే గృహానికి పాతదారువులను (కలపను) పెట్టి కట్టినచో మనో వైకల్యం, రోగ బాధలు కలుగును. ద్వారం తలుపులు శిథిలమై యున్నను, ద్వారాలకు తలుపులు లేకపోయినను దీర్ఘవ్యాధులు కలుగును. గృహానికి దక్షిణ పశ్చిమ దిశలలో ఉండే గోడలకు కిటికీలు లేకపోయినట్లైతే అల్పాయుర్దాయంగల సంతానం కలుగుతుందని వాస్తు నిపుణులు అంటున్నారు. 
 
గృహంలోపలకు శ్మశానవాటిక నుండి వచ్చే ధూమం వ్యాపిస్తే రోగబాధలు, అపమృత్యుభయం కలుగుతాయి. గృహంలో తగినన్ని గోడలు, స్తంభాలు, కిటికీలు లేకపోతే... దీర్ఘ వ్యాధులు, సంతాన నష్టం కలుగును. దీర్ఘచతురస్రాకార స్థలమే అయినను, గృహము సమచతురస్రంగా నిర్మించినచో ఆ ఇంట ధనము నిలవదు. ప్రవాహం వలె వచ్చి పోవుచుండును.