1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : మంగళవారం, 9 జూన్ 2015 (18:20 IST)

ధనం, విలువైన ఆభరణాలు ఉత్తరపు గదిలో ఎలా దాచాలి?

ధనం, విలువైన ఆభరణాలు, వస్తువులు ఉండే బీరువాలు, ఇనుప పెట్టెలు, షెల్ఫులు మొదలైనవి.. ఉత్తరపు గదిలో ఉత్తర దిశకు ఎదురుగా దక్షిణపు గోడకు చేర్చి పెట్టుకోవాలి. లేదా తూర్పు గదిలో తూర్పు దిక్కునకు ఎదురుగా పడమటి గోడకు చేర్చి పెట్టుకోవాలి. ఏ గదిలోనైనా ఈశాన్యమూలకు ఇది ఉండకుండా చూసుకోవాలి. అలాగే భోజనాల గది పడమర దిశలో ఏర్పరుచుకోవాలి. తూర్పు దిక్కునకు ఎదురుగా పశ్చిమదిశలో కూర్చొని భోజనాలు చేయడం మంచిది. పడమటి దిశకు ఎదురుగా కూర్చుని భోజనం చేయరాదు. 
 
ఇక వంటగది విషయానికొస్తే.. వంటగది ఆగ్నేయదిశలో ఉండాలి. అలా కుదరనప్పుడు దక్షిణ నైరుతిలో వంటగది కట్టుకోవచ్చు. తూర్పు, ఈశాన్యం, ఉత్తరదిశల్లో మాత్రం వంటగది కట్టకూడదు. వంటగదిలో ఆగ్నేయ భాగంలో పొయ్యి ఉండటం శ్రేయస్కరం. ఇతర దిశలలోగాని-మూలలోగాని పొయ్య వేయకూడదు. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం ఈ నాలుగు మూలలకు ఎదురుగా పొయ్యి ఉండకుండా చూసుకోవాలని వాస్తు నిపుణులు అంటున్నారు.