శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : బుధవారం, 24 అక్టోబరు 2018 (11:46 IST)

స్త్రీలు ఆలయాలలో పూజలు చేయకూడదా.. ఎందుకు..?

స్త్రీలు ఇంట్లో మాత్రమే ఎందుకు పూజలు చేస్తున్నారు.. ఆలయాలలో చేయకూడదా.. చేయెుచ్చు. కానీ ప్రాచీనకాలంలో వేద సమాజం స్త్రీ పురుషులకు వేరువేరు బాధ్యతలు అప్పగించింది. అలానే ఇంటి జీవన వైభవం గృహలక్ష్మీ చేతిలో, సామాజిక జీవన బాధ్యతలను పురుషుని చేతిలో పెట్టింది. ఈ పద్ధతులను స్త్రీల శారీరర, మానసిక స్థితిగతులను బట్టి వారి పిల్లల బాధ్యతలు బట్టి ఇలా అప్పగించడం జరిగిందని వాస్తుశాస్త్రం చెబుతోంది.
 
ఋతు సమయంలో మహిళలు కొన్ని రోజులు పాటు శారీరకంగా ఇబ్బందులతో బాధపడుతుంటారు. చంటి పిల్లలు అమ్మలను హత్తుకునే ఉంటారు. ఇందుకు ప్రత్యామ్నాయం పురుషుడే అయినా.. స్త్రీలను అర్చకత్వం వద్దన్నది లేదు. అలానే ఎంతో మంది స్త్రీలు నోము సమాయాల్లో పల్లెల్లో పూజలు చేస్తుంటారు. గ్రామ దేవతలకు అర్చనలు చేస్తుంటారు. 
 
స్త్రీలు పురుషులకు సమానం కాబట్టి వారు నోములు, వ్రతాల సమాయాల్లో పూజలు చేస్తుంటారు. ఇది కూడా అంతే. స్త్రీలు ఇంట్లో మహాలక్ష్మీగా ఉంటారు. పురుషులు ఆలయాల్లో పూజారులుగా ఉంటారు. స్త్రీలు ఎప్పుడూ ఆలయానికి రావాలనున్నా రావొచ్చు.. కానీ, కొన్ని సందర్భాల్లో వెళ్లాలనుకున్నా వెళ్లలేం. కాబట్టే స్త్రీలకు ఇంట్లో పూజలు చేసే పద్ధతిని అప్పగించారు.