కష్టాలను తొలగించే వాస్తు చిట్కాలు.. (video)
బాగా సంపాదించినా.. విపరీతమైన ఖర్చులు వేధిస్తున్నాయా..? అప్పుల బాధ పెరిగిపోతుందా..? అయితే రోజూ ఉదయం పూట పక్షులకు తీపి బిస్కెట్లను పెట్టండి. తద్వారా అనవసరపు ఖర్చు తగ్గుతుంది. కారణం లేకుండా ఇంట్లో చిన్న పిల్లలు రాత్రి పూట ఏడిస్తే.. ఆ గదిలో రాళ్ల ఉప్పును కలిపిన నీటిని బెడ్ కింద వుంచితే పిల్లలు హాయిగా నిద్రపోతారు. వంటగది, పడకగది పక్కపక్కనే వుంటే దంపతులు అన్యోన్యంగా వుంటారు.
దుష్ట శక్తులు దరిచేరకుండా వుండాలంటే.. ఇంటి ప్రధాన ద్వారం వద్ద చిన్నపాటి గోరింటాకు కొమ్మను ఇంటి ముందు వేలాడదీయడం చేయాలి. నవధాన్యాలను పసుపు రంగు వస్త్రంలో వుంచి.. వ్యాపారాలు చేస్తున్న దుకాణాల ద్వారానికి కడితే.. డబ్బుల పెట్టేలో నవధాన్యాలను వుంచితే వ్యాపారాభివృద్ధి వుంటుంది.
అలాగే ఉదయం పూట బంగారు నాణేలు కలిగిన ఫోటోలు లేదంటే శ్రీ మహాలక్ష్మీ ప్రతిమను చూసినట్లైతే.. శుభ ఫలితాలుంటాయి. ఇంటి చుట్టూ ఫౌంటైన్లు వుంటే ధనాదాయం వుంటుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.