శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 జూన్ 2018 (11:01 IST)

బొమ్మలను తాకితే గర్భం వస్తుందా? ఎక్కడ?

మానవ సృష్టిలో అపురూపమైనది స్త్రీ. అలాంటి స్త్రీ అమ్మతనం కోసం పరితపిస్తుంది. అమ్మను కాబోతున్నానని తెలిసిన మరుక్షణం అనిర్వచనీయమైన ఆనందానికి, అనుభూతిని పొందుతుంది. నవమాసాలు గర్భందాల్చడమేకాకుండా, ప్రసవవేద

మానవ సృష్టిలో అపురూపమైనది స్త్రీ. అలాంటి స్త్రీ అమ్మతనం కోసం పరితపిస్తుంది. అమ్మను కాబోతున్నానని తెలిసిన మరుక్షణం అనిర్వచనీయమైన ఆనందానికి, అనుభూతిని పొందుతుంది. నవమాసాలు గర్భందాల్చడమేకాకుండా, ప్రసవవేదనను సైతం భరిస్తూ తన ప్రతిరూపానికి జన్మనిస్తుంది స్త్రీ. అలా అమ్మతనపు సౌభాగ్యానికి అద్దం పడుతుంది. జీవితంలోని మరేఘట్టం కూడా మాతృత్వం తాలూకు మధురిమను పంచదనే సత్యం నిర్వివాదాంశం.
 
అయితే ఈ రోజుల్లో అమ్మతనం పొందాలంటే చాలాకష్టపడాల్సి వస్తుంది. వాతావరణం, ఆహారం, ఒత్తిడి రకరకాల కారణాలతో అమ్మతనానికి చాలా మంది మహిళలు దూరమవుతున్నారు. సంతానలోపంతో వారు నరకయాతన అనుభవిస్తున్నారు. సమాజం దృష్టిలో సంతాన భాగ్యం లేని గొడ్రాలుగా మిగిలిపోతున్నారు. 
 
అయినప్పటికీ.. వారిలో ఓ మూలో చిన్నపాటి ఆశ ఉంటుంది. ఆ ఆశను నిజం చేసుకునేందుకు వేలకు వేలు ఖర్చుపెట్టి ఆస్పత్రుల చుట్టు తిరుగుతుంటారు. కానీ ఆ దేశంలో బొమ్మ(విగ్రహం)ను పట్టుకుంటేనే గర్భం వస్తుందనే వార్త హల్‌చల్ చేస్తోంది. ఇదే అంశాన్ని ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది కూడా.
 
అలాంటి బొమ్మలు ఆఫ్రికాలో ఉన్నాయి. ఇక్కడి లొహారి కోస్టాలో బహ్లు ట్రైబూ అనే తెగకు చెందిన వారు కొన్ని చెక్క బొమ్మల్ని తయారు చేసి వారి నివాసంలో ప్రతిష్టించేవారు. అయితే వీటి మహిమల గురించి తెలుసుకున్న జో కస్సింక్సీ అనే సంస్థ మ్యూజియాన్ని ఏర్పాటు చేసి అందులో ప్రదర్శనకు ఉంచారు. 
 
1993 అలా ప్రదర్శనకు వచ్చిన ఓ మహిళ ఆ బొమ్మల్ని తాకడంతో ఎన్నో ఏళ్లు ఎదురు చూస్తున్న మాతృత్వాన్నిపొందిందట. ఈమె బూమ్లెట్ అనే పాపకు జన్మించింది. ఈ వార్త ఆనోటా ఈనోటా పాకడంతో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. అంతేకాదు అమ్మతనం కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది మహిళలు కూడా ఇదేవిధంగా గర్భందాల్చినట్టు మ్యూజియం మేనేజర్ వెల్లడించాడు.