గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 అక్టోబరు 2014 (18:33 IST)

నడుము నొప్పికి కొన్ని చిట్కాలు..!

నడుము నొప్పి లేదా వెన్ను నొప్పికి కారణం మనం వినియోగించే తీరు. ఆఫీసుల్లో కూర్చుని పనిచేసే వారు ఇటువంటి నొప్పులకు గురవుతుంటారు. అందుకే తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. 
 
అవేంటంటే..?
* బల్లకు వీలైనంత దగ్గరగా కుర్చీ ఉండాలి.
* కుర్చీలో కూర్చున్నప్పుడు మీ రెండు పిరుదులు సమంగా కుర్చీకి ఆన్చి ఉండాలి. 
* కుర్చీలో కూర్చుండి హఠాత్తుగా పక్కకు తిరిగే ప్రయత్నం చేయకూడదు. పక్కకు తిరగాల్సి వస్తే శరీరమంతా తిప్పండి. 
 
* ఒకే భంగిమలో గంటల తరబడి కూర్చుని పనిచేయవద్దు. అటు, ఇటు కదలండి
* పనిచేసేటప్పుడు మెడకాయను పక్కకు వాల్చవద్దు. తిన్నగా ఉంచి పనిచేయండి. 
* బల్ల మీదికి శరీరం ఉంచి పనిచేయవద్దు. 
* కాళ్ళను వేళ్ళాడదీసి కూర్చోవద్దు. పాదాలకు అడుగున ఏదైనా పీట వంటి దాన్ని పెట్టుకోండి.