1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By PNR
Last Updated : సోమవారం, 21 జులై 2014 (16:08 IST)

ఇంటర్‌కోర్స్ తర్వాత బ్లీడింగ్ అవుతోంది... ఏం చేయాలి?

ఇంటర్‌కోర్స్ తర్వాత బ్లీడింగ్ అవుతుంటే ఏం చేయాలన్న అంశంపై వైద్య నిపుణులను సంప్రదిస్తే.. ఈ విధమైన అసాధారణ వెజినల్ రక్తస్రావం పట్ల ఎంతమాత్రం అశ్రద్ధ వహించరాదు. వీలైనంత త్వరగా గైనకాలజిస్టుని సంప్రదించి.. ఇంటర్‌కోర్స్ తర్వాత బ్లీడింగ్ కావడానికి గల కారణాలను ముందుగా గుర్తించాలి. ఇందుకు తగిన పరీక్షలు చేయించుకోవాలి. 
 
అలాగే యుక్త వయస్సులో ఉండే యువతులు ప్రతి యేటా పాస్ స్మియర్ పరీక్షలు చేయించుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే.. ఈ తరహా వైద్య పరీక్షల వల్ల చిన్న చిన్న సమస్యలు కూడా వెలుగుచూస్తాయి. అయితే జబ్బులున్నాయని ఈ తరహా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నానే ఫీలింగ్ నుంచి దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.