గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 22 జూన్ 2018 (15:30 IST)

కంప్యూటర్ ముందు ఒకే వైపు చూడొద్దు.. ప్రతి 20 నిమిషాలకు.. 20 అడుగుల దూరంలో?

కంప్యూటర్ ముందు గంటలపాటు కూర్చుంటున్నారా అయితే ప్రతి 20 నిమిషాల పాటు దూరంగా ఉన్న వస్తువులను 20 సెకన్ల పాటు చూడడం ద్వారా మీ కళ్లకు చక్కని వ్యాయావం చేసినట్లవుతుంది. మీరు ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు గడపవ

కంప్యూటర్ ముందు గంటలపాటు కూర్చుంటున్నారా అయితే ప్రతి 20 నిమిషాల పాటు దూరంగా ఉన్న వస్తువులను 20 సెకన్ల పాటు చూడడం ద్వారా మీ కళ్లకు చక్కని వ్యాయావం చేసినట్లవుతుంది. మీరు ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు గడపవలసి వచ్చినపుడు వివిధ రకాల వస్తువులను వివిధ కోణాలలో తరచుగా చూస్తూ ఉండడం కంటి ఆరోగ్యానికి మంచిది.
 
ఎపుడైతే అధిక పని లేదా ఎక్కువ ఒత్తిడిలో ఉన్నపుడు తరచుగా విశ్రాంతి తీసుకోవాలి. ఈ విశ్రాంతుల వలన మీ కళ్ళపైన పడే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. కళ్ళకు విశ్రాంతి కోసం కంప్యూటర్ తెరపై ఉన్న కాంతిని తగ్గించుకుంటే మంచిది. కానీ తెర కాంతిని మరి ఎక్కువగా తగ్గిస్తే ఇది కుడా కళ్ళకు ప్రమాదాన్ని కలుగచేస్తుందని ఐ కేర్ నిపుణులు అంటున్నారు.