శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (15:22 IST)

ప్లాస్క్‌ను ఎలా శుభ్రం చేయాలో తెలుసుకోండి!

కాఫీ, టీలను ఫ్లాస్క్‌‌లో తెప్పించుకుని తాగేవారు, ఇంటిలో కూడా ఫ్లాస్క్‌లోనే పోసి పెట్టుకునేవారు ఫ్లాస్క్‌ని శుభ్రంగా పెట్టుకోకపోతే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటారు. శుభ్రత లేని ఫ్లాస్క్‌లోని కాఫీ, టీల వాసన మారుతుంది. అటువంటి ఫ్లాస్క్‌ల్లో మరిగే నీటిని, దానిలో 2-3 చుక్కల వెనిగర్ వేసి మూత పెట్టి కొద్దిసేపు వుంచి ఆ పైన ఫ్లాస్క్‌ను శుభ్రం చేయాలి. 
 
ఫ్లాస్క్‌లో వేడి కాఫీ, టీ పోసే ముందు గోరువెచ్చని నీటిని పోసి, ఒంపేయాలి. వారానికి పైగా వాడని ఫ్లాస్క్‌లను తిరిగి వాడటం మొదలు పెట్టే ముందు ఫ్లాస్క్‌లో రెండు స్పూన్ల సోడా ఉప్పు వేసి, వేడి నీటిని పోసి రాత్రంతా అలాగే ఉండనివ్వాలి. 
 
మరుసటి రోజు నీటితో ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి అప్పుడు దానిని వాడటం మొదలెట్టాలి. కాఫీ, టీలకు ఫ్లాస్క్‌ని వాడిన వెంటనే నీటిని పోసి వెంటనే శుభ్రం చేసుకోవడం ఎంతో అవసరం. ఫ్లాస్క్‌లను ఉపయోగించేటప్పుడు ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి.