గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 11 నవంబరు 2018 (07:44 IST)

అరటి పండు ఆడవాళ్ళకు మంచిది.. ఎందుకో తెలుసా?

ప్రకృతి ప్రసాదించిన పండ్లలో అరటి పండు ఒకటి. ఈ పండును ఇష్టపడని వారంటూ ఉండరు. భోజనం చేసిన తర్వాత ఈ పండును ఆరగించే వారే ఎక్కువ. బాగా ఆకలిగా ఉన్నపుడు ఒక్క అరటి పండుతో క్షుద్బాధను తీర్చుకోవ్చు. అలాంటి అరటి పండు ఆరగించడం వల్ల స్త్రీలకు ఎంతో మేలు జరుగుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
సాధారణంగా 45 యేళ్లు పైబడిన స్త్రీలు మోనోపాజ్‌ (బహిష్టు ఆగిపోవడం) దశలోకి అడుగుపెడతారు. ఇలాంటి స్త్రీలు అరటిపళ్లు ఆరగిస్తే చాలా మంచిదట. అది వాళ్లల్లో స్ట్రోక్‌ సమస్యలను చాలా మేరకు తగ్గిస్తుందని తాజాగా నిర్వహించి ఓ అధ్యయనంలో వెల్లడైంది. 
 
ఈ దశలో ఉండే మహిళలు పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల స్ట్రోక్‌ను అధిగమించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయనం కోసం మెనోపాజ్‌లో ప్రవేశించిన మొత్తం 90,137 మహిళలను శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఈ మహిళలందరూ 50-79 వయస్సు వాళ్లు. 11 సంవత్సరాల పాటు ఈ స్టడీని కొనసాగించారు. 
 
స్త్రీలు పొటాషియం ఎక్కువ ఉండే ఆహారపదర్థాలు తప్పనిసరిగా తీసుకోవాలని, అదేసమయంలో ఎక్కువ పొటాషియం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదట. అలాచేస్తే గుండెకు హానికరమని వారు హెచ్చరిస్తున్నారు. పోషకవిలువలున్న ఆహారాన్ని వీరు బాగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవని వారు సలహా ఇస్తున్నారు.