గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 6 సెప్టెంబరు 2014 (18:02 IST)

గుండెపోటు ఇంటి మందు: ఆలుగడ్డలు, అరటిపళ్లు, కూరలు..!

ఇదేంటి అనుకుంటున్నారా? నిజమేనండి. వయసు పెరిగేకొద్దీ గుండెపోటు సమస్యతో భయం తప్పదు. అయితే సాధారణంగా సంభవించే గుండెపోటు నివారణకు చక్కని పరిష్కారం మన ఇళ్లలోనే ఉందని పరిశోధకులు అంటున్నారు.
 
పొటాషియం సమృద్ధిగా లభించే ఆలుగడ్డలు, అరటిపళ్లు, తాజా కూరగాయలను తీసుకుంటే గుండె ప్రమాదాన్ని అడ్డుకున్నట్టేనని పరిశోధకులు వెల్లడించారు. 50 నుంచి 79 ఏళ్ల వయసున్న సుమారు 90 వేల మంది మహిళలపై 11 ఏళ్లపాటు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు తేటతెల్లమైనట్లు పరిశోధకులు చెబుతున్నారు. 
 
రోజూ సుమారు 2,611 మిల్లీగ్రాముల పొటాషియంను ఆహారం ద్వారా తీసుకునే మహిళలకు గుండెపోటు ముప్పు తక్కువని పరిశోధకులు స్పష్టం చేశారు.