ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2023 (12:41 IST)

మహిళలు హార్మోన్ సమస్యల నుంచి గట్టెక్కాలంటే...

Young woman
అనేక మంది మహిళలకు హార్మోన్ సమస్యలు ఉంటాయి. వీటిని తగ్గించుకోవటానికి రకరకాల మందులు వాడుతుంటారు. ఈ మందులు వాడటం వల్ల మరిన్ని సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. అయితే, మందుల కంటే ఆహారంలో మార్పులు చేయటం ద్వారా హార్మోన్ల అసమతౌల్యం వల్ల కలిగే ఇబ్బందులను సరిచేసుకోవచ్చని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా కూరగాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. 
 
ఫైబర్ తగినంత ఉంటే ఈస్ట్రోజన్ నియంత్రణలో ఉంటుంది. అందువల్ల హార్మోన్ సమస్యలు ఉన్నవారు ప్రతి రోజు క్రమం తప్పకుండా కూరగాయలను ఆహారంలో ఒక భాగం చేసుకోవాలి. ఒమెగా-3 ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే పెరుగు, కోడిగుడ్డు, ఆలీవ్ ఆయిల్ వంటి పదార్ధాలను తినటం వల్ల మంచి కొలస్ట్రాల్ ఉత్పత్తి పెరుగుతుంది. కొలస్ట్రాల్ ఉత్పత్తి తగినంత ఉంటేనే హార్మోన్లు తగినన్ని విడుదలవుతాయి. 
 
అందువల్ల ప్రతి రోజు ఒమెగా-3 ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. ప్రతి రోజు మనం తినే ఆహారంలో ప్రొటీన్ తప్పనిసరిగా ఉండాలి. బ్లడ్ షుగర్‌ను నియంత్రించే ప్రొజెస్టిరోన్ అనే హార్మోన్ ఉత్పత్తిలో ప్రొటీన్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల ప్రతి రోజు తప్పనిసరిగా ప్రొటీన్‌ను తీసుకోవాలి.
 
చాలా మందికి మంచినీళ్లు తాగే అలవాటు ఉండదు. చాలా రకాల ఆరోగ్య సమస్యలు - తగినన్ని నీళ్లు తాగకపోవటం వల్లే వస్తాయి. అందువల్ల ప్రతి రోజు కనీసం 1.5 లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలి. మనం ఎంత ఆహారం తిన్నా- కొన్ని సార్లు తగినన్ని విటమిన్లు లభించకపోవచ్చు. అందువల్ల విటమిన్ ఏ, బి, డి, కె, ఈ ఉన్న మాత్రలను తప్పనిసరిగా వాడాలి అని సూచిస్తున్నారు.