ఆదివారం, 17 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2024 (14:38 IST)

ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని సేవిస్తున్నారా..? రక్తపోటు తప్పదట!

drinking water
ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని సేవిస్తున్నారా.. అయితే తప్పక దీనిని చదవాల్సిందే. ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని సేవించడం ద్వారా  రక్తపోటు అధిమవుతుందని తాజా అధ్యయనంలో తేలింది. రోజూ వారీగా మనం ప్లాస్టిక్ ఉత్పత్తులను అధికంగా వాడుతుంటాం. 
 
అల్యూమినియం, సిల్వర్ కంటే ప్రస్తుతం ప్లాస్టిక్ ఉపయోగం అధికం అవుతోంది. ముఖ్యంగా నీటి బాటిల్స్ ప్లాస్టిక్ రూపంలో వాడేస్తున్నారు చాలామంది.
 
ఆ ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని నింపి.. వేడిగా వుండే ప్రాంతంలోనూ, అలాగే చల్లదనం కోసం ఫ్రిజ్‌లో వుంచడం ద్వారా అందులో మైక్రో ప్లాస్టిక్ కలుస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. 
 
ఇలా మైక్రో ప్లాస్టిక్ కలిసిన నీటిని సేవించడం ద్వారా హృద్రోగ సమస్యలు, హార్మోన్‌లో హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు ఏర్పడే అవకాశం వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.