మొబైల్‌లో ఫోటోస్ ఎక్కువగా ఉన్నాయా.. అయితే ఇలా చేయండి..?

Flipkart's Billion Capture smart phone
Last Updated: గురువారం, 6 డిశెంబరు 2018 (15:08 IST)
ఇంట్లో, ఆఫీసులో ఒక్కోసారి పెట్టిన వస్తువులు ఎంతవెతికినా కనిపించవు. ఈ కంగారు లేకుండా ఉండాలంటే.. అనవసరం అనుకున్నవన్నింటిని తీసేయడం మంచిది. అందుకు ఏం చేయాలో ఓసారి తెలుసుకుందాం.
 
ఆఫీసులో పెట్టుకునే వస్తువుల అరతో మెుదలుపెట్టి.. అందులో నిండిపోయిన పేపర్లూ, పుస్తకాలు బయటకు తీసి డిజిటల్ రూపంలో భద్రపరచుకోగలం అనుకున్న వాటినన్నింటిని పక్కన పెట్టాలి. ఇప్పుడు మిగిలిన వాటిలో ఎక్కువగా వాడేవి, తక్కువగా వాడేవి అని రెండు భాగాలు చేసుకుని అవసరం లేవనుకున్నవాటిని పడేయడం మంచిది. 
 
అనుకోకుండా ఒక ఫోటో అవసరమొచ్చి, ఫోన్‌లో ఎంతసేపు వెతికినా దొరకదు. వేల కొద్దీ ఫోటోలుండటమే ఇందుకు కారణం. అలా ఉంటే వాటిని వెంటనే తీసేయాల్సిందే. ఆన్‌లైన్‌లో ఒక క్లౌడ్ అకౌంట్ పెట్టుకుని అందులో ఫోటోలు పెట్టుకోవచ్చు. ముఖ్యమైన ఫోటోలుంటే వాటిని సీడీలో భద్రపరచుకున్నా ఫర్వాలేదు. ఇలా చేయడం వలన ఫోన్ మెమోరీ సామర్థ్యం పెరుగుతుంది. అవసరమనుకున్నప్పుడు ఏ ఫోటో అయినా తొందరగానూ దొరుకుతుంది. 
 
మెయిల్ విషయానికొస్తే.. మెయిల్ అకౌంట్‌లో కూడా వేలకొద్దీ మెసేజీలు అలానే వదిల్తేం. అవసరం లేదనుకున్న వాటిని తీసేయడం మంచిది. లేదంటే ఇప్పుడైనా కాస్త సమయం కేటాయించి అనవసర మనుకున్న వాటిని తొలగిస్తే, అవసరమైనప్పుడు కావాల్సిన సమాచారం తొందరగా దొరుకుతుంది. ఒక్కోసారి ఈ మెసేజీ కావాలని అనుకున్నప్పుడు దొరకదు.. దాంతో మనం కోపానికి లోనవుతాం.. అందువలన పైన చెప్పిన విధంగా చేస్తే.. మంచి ఫలితాలు పొందవచ్చును. దీనిపై మరింత చదవండి :