1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 26 జులై 2014 (17:09 IST)

రాత్రిపూట లైట్లకి బ్రెస్ట్ క్యాన్సర్‌కి సంబంధముందట!

రాత్రిపూట లైట్లకి.. బ్రెస్ట్ క్యాన్సర్‌కి సంబంధముందంటే నమ్ముతారా? నమ్మితీరాల్సిందే.. లైట్ల కాంతికి బ్రెస్ట్ క్యాన్సర్ కణాలు మేలుకుంటాయని తాజా అధ్యయనంలో తేలింది. రాత్రి సమయాల్లో ఎక్కువమంది లైట్స్ ఆర్పి నిద్రపోతే.. మరికొందరు లైట్స్ వెలుతురుతోటే నిద్రపోతారు. అయితే ఈ లైట్ల కాంతికి బ్రెస్ట్ క్యాన్సర్ కణాలు మేలుకుంటాయని, తద్వారా క్యాన్సర్ వ్యాధి మరింతగా విస్తరించే అవకాశం ఉందని అమెరికాలోని టులాన్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే... క్యాన్సర్ కణుతుల తయారీని అడ్డుకునే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి లైట్ల వెలుగులో నిలిచిపోతుంది. దీంతో, రొమ్ము క్యాన్సర్ కణాలు మరింతగా చెలరేగిపోతాయని, అప్పుడవి క్యాన్సర్ ఔషథం టామోక్సిఫెన్‌ను సైతం తట్టుకోగలిగే శక్తిని సముపార్జించుకుంటాయని పరిశోధనల్లో వెల్లడైంది. అందుచేత రాత్రిపూట మహిళలు లైట్స్ ఆఫ్ చేసి నిద్రపోతేనే మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇంకా రాత్రి షిష్టులు, రాత్రుల్లో గంటల కొద్దీ టీవీ, కంప్యూటర్ల ముందు అతుక్కుపోయే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 
 
ఎలుకల్లో రొమ్ము క్యాన్సర్ కణాలను ప్రవేశపెట్టి ఈమేరకు ప్రయోగాలు నిర్వహించారు. క్యాన్సర్ చికిత్సలో టామోక్సిఫెన్ ఔషథాన్ని వాడే మహిళలు రాత్రివేళ లైట్లు ఆపి నిద్రిస్తేనే మంచిదని వర్శిటీ పరిశోధకులు సూచిస్తున్నారు. నైట్ షిఫ్టుల్లో ఉద్యోగాలు చేసేవారు, రాత్రివేళ టీవీలు, కంప్యూటర్ల ముందు కూర్చునే వారు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని సదరు పరిశోధన చెబుతోంది.