శనివారం, 4 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 అక్టోబరు 2023 (22:17 IST)

ఫోన్‌ వ్యసనంతో బాధపడుతున్నారా? ఖాళీ దొరికితే..?

mobile phone
ఫోన్‌ వ్యసనంతో బాధపడుతున్నారా? అయితే కొన్ని చిట్కాలు సరిగ్గా పాటిస్తే దాన్నుంచి బయటపడవచ్చు. ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. ఖాళీ సమయం దొరికితే ఆన్‌లైన్ గేమ్‌లు, సోషల్ మీడియా బ్రౌజింగ్, చిట్ చాట్ చేస్తూ సమయాన్ని వృధా చేసుకుంటారు. 
 
అయితే సెల్ ఫోన్ అడిక్షన్ నుండి బయటపడకపోతే, అది మన ఆరోగ్యంపై చెప్పలేని దుష్ప్రభావాలకు కారణమవుతుంది. ఫోన్ లేకుండా మీరు ఏదో కోల్పోతున్నట్లు మీకు అనిపిస్తుందా? ఇంకా విసుగుగా వుందా? అయితే ఇది కచ్చితంగా సెల్ ఫోన్ వ్యసనమే. దాని నుండి బయటపడటానికి ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. 
 
ఫోన్ వ్యసనాన్ని తగ్గించడానికి చిట్కాలు:
మీ ఫోన్‌ని ఉపయోగించకుండా వారానికి ఒక రోజు సెల్ ఫోనుకు దూరంగా వుండాలని నిర్ణయం తీసుకోండి. శనివారం, ఆదివారం మధ్య వారాల్లో ఏదైనా రోజును ఫోన్ తక్కువగా ఉపయోగించండి. 
 
ఫోన్‌ను పక్కనబెట్టి వెలుపలి ప్రపంచాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నించండి. ఈ రెండింటి మధ్య తేడా మీకు అర్థమవుతుంది. మీ ఫోన్‌ని బెడ్‌రూమ్‌లోకి తీసుకురాకూడదని మీ కోసం ఒక నియమం చేసుకోండి. 
 
మంచం పక్కన ఎప్పుడూ ఛార్జ్ చేయవద్దు. పడకగదిని ‘నో ఫోన్ జోన్’గా మార్చడానికి ప్రయత్నించండి. ఫోన్‌ని ఎల్లప్పుడూ మీ పక్కనే ఉంచుకోవద్దు. బదులుగా డ్రాలో ఉంచండి. కాబట్టి మనం ఎన్నిసార్లు ఫోన్ తీయడానికి ప్రయత్నిస్తున్నామో మనకు తెలుసు. 
 
ఫోన్ ఎదురుగా కనిపించినప్పుడు, ఎక్కువ శ్రద్ధ దానిపైకి వెళ్తుంది. ఫోన్‌లోని అన్ని యాప్ నోటిఫికేషన్‌లను ఆఫ్ చేసినట్లు నిర్ధారించుకోండి. లేదంటే కొన్ని నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. అవి మన ఫోన్‌ని మళ్లీ మళ్లీ చూడమని ప్రేరేపిస్తూనే ఉంటాయి.