1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 అక్టోబరు 2015 (13:42 IST)

అమ్మాయిలూ వీడియో గేమ్స్ ఆడుతున్నారా.. అయితే లావై పోతారు... జాగ్రత్త!

చాలా మంది అమ్మాయిలు కంప్యూటర్ ముందు కూర్చొని గంటల తరబడి కంప్యూటర్ గేమ్స్ ఆడుతుంటారు. ఈ అలవాటు మంచిది కాదని ఇంట్లోని పెద్దలు పదేపదే హెచ్చరిస్తున్నా.. వారు పట్టించుకోరు. కానీ, అధ్యయనకారులు సైతం ఈ తరహా హెచ్చరికలు చేస్తున్నారు. లేనిపక్షంలో అమ్మాయిలు మరింతగా లావై పోతారంటూ వారు చెపుతున్నారు.
 
 
రోజుకు కనీసం రెండు గంటల పాటు కంప్యూటర్ ముందు కూర్చొని వీడియో గేమ్స్ ఆడే అమ్మాయిలు ఐదేళ్ళలో 3.7 కేజీల బరువు పెరిగారు. ఐదేళ్ళపాటు సాగిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని వారు వెల్లడించారు. 
 
వీడియో గేమ్స్ ఆడని అమ్మాయిల కంటే కంప్యూటర్ ముందు కూర్చొని వీడియో గేమ్స్ ఆడే అమ్మాయిల బరువు పెరిగినట్టు తేలింది. రోజూ రెండు గంటల పాటు వీడియో గేమ్స్ ఆడే సాధారణ ఎత్తు, బరువు ఉన్న అమ్మాయిల బరువు 3.7 కిలోగ్రాములు పెరిగినట్టు వెల్లడించారు. 
 
అంతేకాకుండా, ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు గడపటం, ఖాళీ సమయాల్లో శారీరక వ్యాయామం చేయక పోవడం, వయస్సు పెరగడం, జీవనశైలి, వృత్తి వంటి అంశాల వల్ల కూడా భారీ కాయం వచ్చే అవకాశం ఉందని స్వీడన్‌లోని గోధెన్‌బర్గ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు వెల్లడిచారు.