శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 9 అక్టోబరు 2014 (17:28 IST)

సెన్సిటివ్ కళ్ళకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

కళ్ళు చాలా సెన్సిటివ్ అయితే.. ఐ మేకప్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇతరులు ఉపయోగించిన ఐ మేకప్ ప్రొడెక్ట్స్ యూజ్ చేయకూడదు. ప్రత్యేకమైన బ్రష్, మేకప్ కిట్ ఉంచుకోవాలి. 
 
కళ్ళు చాలా సెన్సిటివ్‌గా ఉన్నవారికి ఐ షాడో పౌడర్స్ అప్లై చేయడం వల్ల కూడా కొన్ని కళ్ళఇన్ఫెక్షన్ సమస్యలు వస్తుంటాయి. ఐషాడో పౌడర్స్‌లో గ్లిట్టర్ లేదా మెరిసేటి ఐషాడో పౌడర్స్‌కు దూరంగా ఉండాలి. ఎందుకుంటే ఇవి కూడా సున్నితమైన కళ్ళకు ఇరిటేషన్ కలిగిస్తాయి.
 
అంతేగాకుండా.. ఇన్నర్ ఐస్‌‌కు లైనింగ్ వేయడం నివారించాలి. ఇది అప్లై చేస్తే చూడటానికి కళ్ళు అందంగా కనిపించినా, అనుకోకుండా చాలా సున్నితంగా ఉన్న కళ్ళకోసం ఇటువంటి ఇన్నర్ లైనర్‌ను నివారించాలి. సున్నితమైన కళ్ళు కలిగిన వారు ఐపెన్సిల్‌తో అవుట్ సైడ్ లాష్‌ను అప్లై చేయవచ్చు.
 
చాలా సెన్సిటివ్‌ కళ్ళను కలిగివుండే వారు సురక్షితమైన కళ్ళ కోసం.. బ్రష్‌లను ప్రతిసారి శుభ్రం చేసుకోవాలి. లేదంటే బ్రష్ మీద సన్నని డస్ట్ చేరి, కళ్ళకు ఇన్ఫెక్షన్ అవుతుంది. ఈ సమస్యను నివారించడానికి మేకప్ బ్రష్‌లకు రెగ్యులర్ క్లీనింగ్ చాలా అవసరం. షాంపుతో బ్రష్‌లను శుభ్రం చేసి పొడివస్త్రంతో తుడిచి పెట్టాలి.