శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 జూన్ 2015 (19:02 IST)

సూర్యరశ్మితో ఎన్నో ప్రయోజనాలు: రోగాల నుండి రక్షణ

సూర్యరశ్మితో ఎన్నో ప్రయోజనాలున్నాయని వైద్యులు అంటున్నారు. సూర్యరశ్మి వల్ల ఎముకలకు కావల్సినంత విటమిన్ డిని ఉత్పత్తి అవుతుంది. ఈ విటమిన్ శరీరంలో కాల్షియం శోషణ చెందడానికి సహాయపడుతుంది. నేచురల్ సన్ లైట్ వల్ల విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. విటమిన్ డిని సాల్మన్ చేపల్లో ఫోర్టిఫైడ్ డైరీ ప్రొడక్ట్స్ కూడా ఉంటుంది. 
 
అయితే ఇది సూర్యరశ్మిలో ఉండటం వల్ల చాలా సులభంగా మన శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. ఇతర రోగాల నుండి రక్షణ కల్పిస్తుంది తాజా పరిశోధన ప్రకారం శరీరంలో సరిపడా విటమిన్ డి ఉన్నట్లైతే అది కొన్నిప్రమాదకరమైన జబ్బులైన గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుంది. 
 
కాబట్టి, ఈ నేచురల్ విటమిన్ డిని సన్ లైట్ నుండి పొందవచ్చు. ఇది విటమిన్ డి సప్లిమెంట్ కంటే చాలా ఎక్కువ విలువలు కలిగి ఉంటుంది. సూర్యరశ్మి వల్ల ఆటోమేటిక్‌గా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా అనారోగ్యాల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. 
 
సూర్యదోయం అయ్యే సమయంలో సూర్యరశ్మిలో ఉండటం వల్ల శరీరం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అది కూడా మీకు సరైన నిద్రపోవడం కూడా ఒక రకంగా సహాయపడుతుంది. బరువును కూడా సరిగా మ్యానేజ్ చేయాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.