మహిళల ఆరోగ్యం... అధికార హోదాలు..

బుధవారం, 27 జూన్ 2018 (16:42 IST)

ఉన్నత పదవులు, అధికారంలో ఉండే మహిళలకు కుంగుబాటు తప్పదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఉద్యోగ వాతావరణంలో పెద్దస్థాయికొచ్చిన మహిళలు రకరకాల మాటలు పడాల్సి వస్తుంది. అయితే ఆ స్థాయికి వెళ్లడానికి మహిళలు మానసికంగా ఆరోగ్యపరంగా భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. దానినే మానసిక కుంగుబాటు అంటారు.
 
అధికార హోదా మగవాళ్లకు ఆత్మవిశ్వాసాన్నీ సమాజంలో ఉన్నత హోదానీ అందిస్తే మహిళల్లో మాత్రం అది మానసికంగా ప్రతికూల ప్రభావాన్నే చూపిస్తోందని పరిశోధనలో వెల్లడైంది. స్త్రీల మానసిక అనారోగ్యానికి కారణమయ్యే అంశాలపై జరిపిన పరిశోధనలో అధికార హోదాలో ఉండే మహిళల్లో మానసిక కుంగుబాటు ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు.
 
మహిళలు పెద్ద స్థాయికి చేరుకోవాలంటే మగవారికన్నా మహిళలు ఎంతో పోరాడవలసి వస్తోంది. కుటుంబంలో, కార్యాలయంలో అనేక వివక్షల్నీ, అసూయల్నీ ఎదుర్కొంటూ ముందుకెళ్లాలి. ఆ క్రమంలో మనస్సులో ఏర్పడే ఆవేదనలే కుంగుబాటుకి కారణం అవుతున్నాయి.  
 
దీని నుండి బయటపడాలంటే వీలు కుదిరినప్పుడల్లా బాధ్యతల్ని పక్కనపెట్టి తమపై తాము శ్రద్ధ పెట్టాలి. వ్యక్తిగత ఆసక్తులకు, వ్యాయామానికి సమయం కేటాయించాలని మానసిక నిపుణులు అంటున్నారు.దీనిపై మరింత చదవండి :  
మహిళలు అధికార హోదాలు వ్యాయామం కుంగుబాటు ఆరోగ్యం చిట్కాలు విశ్రాంతి ఆలోచనలు Womens Office Work Responsibilities Exercise Depression Health Tips

Loading comments ...

మహిళ

news

పళ్లు తెల్లగా కనిపించాలంటే?

మహిళల అందానికి అనువైన ఆభరణం నవ్వే అంటారు కొందరు. అయితే పళ్లు పసుపు పచ్చగా ఉండడంతో ...

news

జుట్టు చివర్ల చిట్లిపోతుందా...? ఇలా చేస్తే అరికట్టవచ్చు...

జుట్టు చివర్ల చిట్లిపోవడం వలన చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. జుట్టు చివర్లు ...

news

ముడతల చర్మానికి పైనాపిల్ రసం తీసుకుంటే?

చర్మంపై ముడతలకు చెక్ పెట్టాలంటే ఈ చిట్కాలు పాటిస్తే మంచిది. తాజా టమోటాలను బాగా ...

news

మహిళల విజయానికి సూత్రాలు....

మహిళలుగా మీరు ఎన్నుకున్న మార్గంలో విజయం సాధించాలంటే ఇప్పటికే అనేక విజయాలను సాధించిన ...