అబ్బా.. పురుషులతో కలిసి పనిచేసే మహిళల్లో ఒత్తిడి మరీ ఎక్కువట..
పురుషులకు సమానంగా ప్రస్తుతం అన్నీ రంగాల్లో మహిళలు రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఆధునికత పెరుగుతున్న కొద్దీ మహిళలు కుటుంబం, ఉద్యోగంతో పోటీపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు తోడుగా ఒత్తిడిని కూడా ఫాస్ట
పురుషులకు సమానంగా ప్రస్తుతం అన్నీ రంగాల్లో మహిళలు రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఆధునికత పెరుగుతున్న కొద్దీ మహిళలు కుటుంబం, ఉద్యోగంతో పోటీపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు తోడుగా ఒత్తిడిని కూడా ఫాస్ట్ ఫాస్ట్‌గా అధిగమించుకుంటూ దూసుకెళ్లాల్సిన పరిస్థితిలో ప్రస్తుత మహిళలు ఉన్నారు.
ఇంటా బయటా సమస్యలెన్నో ఉన్నా.. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే వారు కొందరుంటే.. వాటిని అధిగమించడం ఎలా అంటూ టెన్షన్ పడుతూ.. ఒత్తిడిని నెత్తిమీద వేసుకునేవారు మరికొందరు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో పురుషులతో పోలిస్తే స్త్రీలలోనే డిప్రెషన్ ఎక్కువ అని తేలిందట.
పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. స్త్రీలల్లో 12 సంవత్సరాల నుంచే ఒత్తిడి ప్రారంభం అవుతుందని.. 20-25 సంవత్సరాల సమయానికి ఆ ఒత్తిడి అమాంతం పెరిగిపోతుందని పరిశోధకులు అంటున్నారు. ముఖ్యంగా పురుషులతో కలిసి పనిచేసే స్త్రీలలో ఒత్తిడి అంతా ఇంతా కాదు.. చాలా ఎక్కువే ఉన్నట్లు పరిశోధనలో వెల్లడి అయ్యింది.
కార్యాలయాల్లో మహిళలు తరచూ ఆందోళనకు గురవుతుంటారని, చివరికి అదే తీవ్రమైన డిప్రెషన్‌కి దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అందుకే కార్యాలయాల్లో మహిళలు ఒత్తిడిని అధిగమించేందుకు శతవిధాలా ప్రయత్నించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. లేకుంటే ఒత్తిడితో ఒబిసిటీ, గుండెపోటు వంటివి తప్పవని హెచ్చరిస్తున్నారు.