శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2015 (13:41 IST)

తల్లిపాలు శ్రేష్ఠం.. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవం ప్రారంభం..

తల్లిపాలు-తల్లి ప్రేమకు కల్తీ అంటూ ఉండదు. నవమాసాలు గర్భంలో ఉన్న తన బిడ్డకు ప్రేమ బంధాన్ని మరింత బలోపేతం చేసేది తల్లిపాలే. శిశువుకు తొలి ఆహారంగా ఇచ్చేది తల్లిపాలే. అలాంటి కల్తీలేని.. ప్రేమతో కూడిన తల్లిపాలు ఎంత శ్రేష్టమైనదో.. తెలియపరిచేవిధంగా శనివారం నుంచి తల్లిపాల వారోత్సవం నిర్వహిస్తున్నారు. ఇంకా తల్లిపాలుపై గల అపోహల్ని తొలగించే విధంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవం జరుపుకోబడుతోంది. 
 
అపోహలు, ఉద్యోగ అవసరాలు, ఇతరత్రా కారణాలతో చాలా మంది తల్లులు బిడ్డలకు పోతపాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిపాలు శ్రేష్ఠమైనదని, దానివల్ల శిశువుకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వంటి ఇతరత్రా అంశాలపై ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రపంచ తల్లిపాల వారోత్సవం జరుపుకోబడుతోంది. 
 
పనిచేసే తల్లులు తమ పిల్లలకు పాలు ఇచ్చే వెసులుబాటు కల్పించాలన్నదే ఈ ఏడాది తల్లిపాల వారోత్సవ ప్రధాన నినాదం. ప్రభుత్వాలు దీనిపై చట్టాలు చేయాలని, ఆయా కంపెనీల యజమానులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రపంచ తల్లి పాల వారోత్సవం నిర్వాహకులు కోరుతున్నారు.