బ్లీచింగ్ పౌడర్‌తో ముగ్గుపిండి.. టాయిలెట్ క్లీనింగ్.. ఎలా..?
వాష్ బేసిన్స్, టాయిలెట్స్ మొదలైనవి క్లీన్ చేయాలంటే.. సగం బ్లీచింగ్ పౌడర్, సగం ముగ్గుపిండి కలుపుకుని ఉంచుకుని దానితో శుభ్రంగా తోమి కడిగితే కొత్త వాటిల్లా తెల్లగా నీట్‌గా మెరుస్తాయి. తలస్నానం చేశాకు కుంకుడుకాయ తొక్కలను లేదా షాంపు కవర్లకు నీటికి అడ్డం పడకుండా ఎప్పటికప్పుడు తీసివేస్తుండండి. దీని వలన నీళ్లు బ్లాక్ అయ్యే ప్రమాదం ఉండదు.
బాత్‌రూమ్‌లోని షవర్, కొళాయిలు, ఇంకా వేరే ఫిట్టింగులు తళ తళా మెరవాలంటే.. కిరోసిన్ తడిపిన బట్టతో తుడవండి.. కిరోసిన్ వాసన ఒక గంటలో పోతుంది.
బాత్‌రూమ్‌లో విడిచిన బట్టలు అలానే ఉంచితే దోమలు, బొద్దింకలు చేరుతాయి. ఎప్పటికప్పుడు విడిచిన బట్టలను ఒక పెట్టెలో వేసి ఉంచండి. లేదా ఉతకండి. బాత్‌రూప్‌లో కిందా, చుట్టూ ఉన్న గోడలకు టైల్స్ కనుక ఉన్నట్లయితే క్లీనింగ్ యాసిడ్‌తో నెలకోసారి కడిగాలి.
ఇప్పుడు ఇళ్ళల్లోనే ఎటాచ్‌డ్ బాత్‌రూమ్స్ ఉండడంతో టాయిలెట్స్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతో ఇంటిల్లిపాది అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. అందువలన ప్రతిరోజూ క్లీనింగ్ పౌడర్‌తో బాత్‌రూపం, టాయిలెట్ కడిగి శుభ్రపరచాలి. అలానే రెండు రోజులకొకసారి ఫినాయిల్‌తో శుభ్రం చేస్తే రోగాలు రావు.