గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : శుక్రవారం, 30 నవంబరు 2018 (12:22 IST)

పన్నీర్‌తో ఫేస్‌ప్యాక్..?

ముఖాన్ని కాంతివంతంగా చేసే అనేకమైన స్కిన్ ప్లాక్స్‌తో పాటు పన్నీరును కూడా చేర్చుకోవచ్చు. ఎందుకంటే పన్నీర్‌లోని యాంటీ ఫంగల్ గుణాలు చర్మాన్ని కాంతివంతంగా మార్చేలా చేస్తాయి. అంతేకాదు.. పలురకాల ఇన్‌ఫెక్షన్స్‌ను తొలగిస్తాయి. పన్నీర్‌లో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే కలిగే లాభాలు తెలుసుకుందాం..
 
కోడిగుడ్డు సొనలో స్పూన్ తేనె, చిటికెడు పసుపు, పన్నీర్ పేస్ట్ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేసినట్లయితే.. ముఖం ముడతలు పోతాయి. ఈ మిశ్రమాన్ని తయారుచేసి ఫ్రిజ్‌లో భద్రపరచి, ఇరవై రోజులపాటు ప్రతిరోజూ వాడుకోవచ్చు.
 
పన్నీర్‌ను మెత్తగా పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా బాదం నూనె, స్పూన్ గ్లిజరిన్, నిమ్మరసం సమపాళ్లలో కలిపి రాత్రి పడుకునే ముందుగా ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఆ తరువాత ఉదయాన్నే చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖ చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
 
ఈ కాలంలో జిడ్డు అధికంగా విడుదలవుతుంది. దీని కారణంగా మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటివారు ప్రతిరోజూ ముఖానికి టొమోటో గుజ్జు పట్టించి, అరగంట తరువాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేసినట్లయితే.. వేసవిలో ఎదురయ్యే జిడ్డు సమస్య నుంచి బయటపడవచ్చు.