శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : గురువారం, 13 డిశెంబరు 2018 (12:21 IST)

జుట్టు రాలిపోతుందా.. ఏం చేయాలి..?

ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది జుట్టు రాలే సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి అనేక కారణాలుంటాయి. అయినప్పటికి జుట్టు రాలిపోతుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అయితే జుట్టు రాలే సమస్య నుండి ఎలా బయటపడాలో.. ఏం చేయాలో చూద్దాం..
 
1. జుట్టుకు నూనె రాసేటప్పుడు గానీ, తలస్నానానికి షాంపూ రాసేటప్పుడు.. వెంట్రుకలకు వేళ్లను తగిలించి మర్దనా చేయాలే కానీ గోర్లతో గట్టిగా గీక కూడదు. అలా చేస్తే జుట్టు రాలడం పెరుగుతుంది.
 
2. వారంలో రెండు రోజులకు ఒకసారైనా తలస్నానం చేయాలి. ముఖ్యంగా తలస్నానం వేడినీళ్లు వాడకూడదు. చల్లని లేదా గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఎక్కువ వేడిగా ఉన్న నీటిని స్నానానికి ఉపయోగిస్తే.. జుట్టు మరింత ఎక్కువగా రాలిపోతుంది. 
 
3. తలస్నానం చేసిన తరువాత జుట్టును బాగా ఆరబెట్టుకోవాలి. లేదంటే టవల్‌తో తుడుచుకోవాలి. కానీ, హెయిర్ డ్రయర్‌ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదు. వాడితే జుట్టు చివర్లో వెంట్రుకలు చిట్లి.. రంగుమారి.. రాలిపోతుంటాయి. దాంతో పాటు జుట్టు మృదుత్వాన్ని కోల్పోతుంది. 
 
4. జుట్టు రాలకుండా ఉండాలంటే.. రోజువారి ఆహారంలో విటమిన్స్, మినరల్స్, వంటి ఖనిజాలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, ఓట్స్, తృణ ధాన్యాలతో పాటు ప్రోటీన్స్, బీటా కెరోటిన్ అధిక మోతాదులో ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇలా చేస్తే వెంట్రులకు పోషణ లభిస్తుంది. జుట్టు రాలకుండా ఉంటుంది.