సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : శుక్రవారం, 18 జనవరి 2019 (14:02 IST)

ముత్యాలు కొనడం ఎలా..?

మహిళలు సౌందర్యానికి ప్రతీక మహిళలే అన్నది జగమెరిగిన సత్యం. అలాంటి మహిళలకు అందాన్ని ఇచ్చేటివి ఆభరణాలు. ఈ ఆభరణాలలో బంగారు, వెండి, వజ్ర-వైఢూర్యాలు, ప్లాటినమ్ లాంటి వస్తువులతోబాటు ముత్యంకూడా మహిళల అందాన్ని మరింత ఇనుమడింపచేస్తుంది. 
 
వివిధ రకాలలో లభ్యమయ్యే ముత్యాలను హారంగా మలుచుకుని మెడలో వేసుకుంటే ఆ ముత్యాల హారానికే అందం వస్తుందంటారు సౌందర్యోపాసకులు. ముత్యాలతో తయారు చేసిన హారాలు వివిధ సందర్భాలలో ఉపయోగించుకోవచ్చు. ఇందులోకూడా అసలు, నకిలీ ముత్యాలను గుర్తించడం ప్రస్తుతం చాలా కష్టం. మీరు ముత్యాలను కొనేందుకు వెళుతుంటే కొన్ని నియమాలను గుర్తుంచుకుంటే సరిపోతుంది. 
 
సాధారణ ముత్యాలు ఒకింత మెరుగును సంతరించుకుంటే, అసలైన ముత్యాల మెరుపులోమాత్రం చాలా తేడాలుంటాయి. అసలైనవి ఎక్కువ మెరుపును కలిగి ఉంటాయి. వీటిలో రోజాపువ్వు రంగు, తెలుపు, గోరుకున్న రంగులలో లభ్యమవుతాయి. ఇతర రత్నాలమాదిరిగానే ముత్యాలనుకూడా రాశులకు సంబంధించి ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ముత్యం అనేది చంద్రునికి ప్రతీక అంటుంటారు. దీనిని ధరించినవారు చంద్రుడంతటి చల్లగా ఉంటారని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.