బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By Kowsalya
Last Updated : బుధవారం, 27 జూన్ 2018 (10:04 IST)

పళ్లు తెల్లగా కనిపించాలంటే?

మహిళల అందానికి అనువైన ఆభరణం నవ్వే అంటారు కొందరు. అయితే పళ్లు పసుపు పచ్చగా ఉండడంతో నలుగురిలో నవ్వును కోల్పోతారు. పళ్లు తెల్లగా మెరిసిపోవాలంటే ప్రతిరోజూ రెండుసార్లు శుభ్రంగా బ్రష్ చేస్తే సరిపోతుంది.

మహిళల అందానికి అనువైన ఆభరణం నవ్వే అంటారు కొందరు. అయితే పళ్లు పసుపు పచ్చగా ఉండడంతో నలుగురిలో నవ్వును కోల్పోతారు. పళ్లు తెల్లగా మెరిసిపోవాలంటే ప్రతిరోజూ రెండుసార్లు శుభ్రంగా బ్రష్ చేస్తే సరిపోతుంది. 
 
అప్పటికీ పళ్లలో పచ్చదనం పోకుంటే ఉంటే టూత్ పేస్ట్‌లో చిటికెడు బేకింగ్ సొడా కలిపి పళ్లు శుభ్రం చేసుకోవచ్చును. దీనికి స్ర్టాబెర్రీ కూడా తోడైతే ఇంకా తళతళా మెరుస్తాయి. అయితే బేకింగ్ సొడా ఆమ్లం కావటం వలన నెలలో రెండు లేదా మూడు సార్లు మాత్రమే వాడాలి. లేకుంటే పళ్లు పటుత్వం కోల్పోయి ఊడిపోయే ప్రమాదం ఉంది.