Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భర్త తన మాటే వినాలంటే భార్య ఏం చేయాలి? ద్రౌపది చెప్పిన సూత్రాలు....

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (20:23 IST)

Widgets Magazine
Beauty

జీవితంలో ఆచరించాల్సినవన్నీ మహాభారతంలో వెతికితే కనబడుతాయి. భర్త ప్రేమను పొందుతూ అతడు తనే లోకంగా వుండాలంటే భార్య ఏం చేయాలి..? భర్తను కొంగుకు కట్టేసుకోవడం ఎలా అనేది చాలామంది స్త్రీలకు అర్థంకాని ప్రశ్నలే. ఐతే దీనిపై ద్రౌపది కొన్ని సూత్రాలు చెప్పింది. సత్యభామ అడిగిన దానికి ద్రౌపది చెప్పినవి ఏమిటో చూద్దాం.
 
ముఖ్యంగా భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఎవ్వరివద్దా భార్య చెప్పకూడదు. అలాగే దాంపత్య రహస్యాలను కూడా వెల్లడించకూడదు. కొందరు భర్తలు తమకు లొంగాలని కోరుకుంటారు. భర్త వశీకరుణకు లొంగడు, అంతేకాదు భార్య తన ఆగ్రహంతో, గర్వంతో, భర్తను తన ఆధీనంలో వుంచుకోవాలని ప్రయత్నం చేయరాదు.
 
భర్త మనసులో కోర్కెను ముందే గ్రహించాలి. భర్త ఆహారం తినేటపుడు భార్య ఆయనతో మాట్లాడరాదు. తినేటపుడు ఎవరైనా అందవిహీనంగా వుంటారు. భర్త ముందు భార్య త్రేన్పులు, అపానవాయులు విడుదల చేయరాదు. ఒక తల్లి కొడుకుకి ఎలా సేవ చేస్తుందో అలాగే భర్తకు కూడా చేయాలి. భర్త ప్రేమను సంపూర్ణంగా పొందాలంటే ఉదరం ద్వారా పొందాలి.. అంటే భర్తకు కమ్మని వంట చేసి పెట్టడం ద్వారా ప్రసన్నం చేసుకోవాలి.
 
భర్తను ఎప్పుడు కూడా కటువైన మాటలు మాట్లాడరాదు. భార్య తన ఇంటి ఆవరణ బయట ఉండరాదు. ఉదయాన్నే ముఖం కడుక్కోకుండా భర్తతో భార్య మాట్లాడరాదు. ఇతరులు ముందైనా, ఇంట్లోనైనా పెద్దగా పగలబడి నవ్వకూడదు. అది ఏ భర్తకూ నచ్చని విషయం. భర్త తెలివితక్కువవాడయినప్పటికీ అతడే తెలివిగలవాడన్నట్లు ప్రవర్తించాలి తప్ప అతడి తెలివితక్కువతనాన్ని బయటపెట్టకూడదు. ఇలాంటివన్నీ ఆచరిస్తే భార్య పట్ల భర్త ఎంతో సన్నిహితంగా వుంటాడని ద్రౌపది వివరించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

టమోటా గుజ్జు, నిమ్మరసాన్ని ముఖానికి రాసుకుంటే?

టమోటా గుజ్జును తీసుకుని అందులో రెండు చుక్కల నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ...

news

వేడి ఆయిల్‌తో మానిక్యూర్ చేసుకుంటే ఫలితం ఏమిటి?

వేడి నూనె ఆయిల్ మానిక్యూర్‌లో మీ చేతులను కొద్దిగా వేడిగా ఉండే నూనెలో మీ చేతులను ...

news

కీరా రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి కళ్ళకు రాసుకుంటే?

అర టీ స్పూన్ కీరా రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలపి ఈ మిశ్రమాన్ని కళ్ళకు రాసుకుని అరగంట సేపు ...

news

మహిళలూ.. ఆనందం ఉంటే.. అందం మీ సొంతం.. అనవసర విషయాలు పట్టించుకోవద్దు..

మహిళలూ ఆనందంగా ఉన్నారా? అయితే అందంగా ఉంటారు. అంటున్నారు. బ్యూటీషన్లు. ఇంట్లో మహిళలు ఎంత ...

Widgets Magazine