మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By Kowsalya
Last Updated : శనివారం, 9 జూన్ 2018 (17:30 IST)

పట్టుచీరలను తడిపేటప్పుడు కుంకుడురసం కలిపితే...

పట్టుచీరల మన్నిక కోసం ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. కొందరికి పట్టుచీరలను ఎలా భద్రపరచాలో తెలియదు. అలాంటి వారు మీరైతే ఈ కథనాన్ని చదవితే మంచిది. ఖరీదైన పట్టుచీరెలను డ్రైక్లీనింగ్ చేయించాలి. పట్టుచీరను

పట్టుచీరల మన్నిక కోసం ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. కొందరికి పట్టుచీరలను ఎలా భద్రపరచాలో తెలియదు. అలాంటి వారు మీరైతే ఈ కథనాన్ని చదవితే మంచిది. ఖరీదైన పట్టుచీరెలను డ్రైక్లీనింగ్ చేయించాలి. పట్టుచీరను భద్రపరిచేటప్పుడు ఆ చీరలో వేపాకును ఉంచడం వల్ల పురుగులు చేరడం, చిల్లులు పడటం వంటి జరుగవు. 
 
అలాగే పట్టుచీరను తడిపేటప్పుడు నీళ్ళల్లో కాస్త కుంకుడు రసం కలపడం మంచిది. పట్టుచీరను విప్పిన వెంటనే మడత పెట్టకూడదు. కొంతసేపు గాలికి ఆరనిచ్చి ఆ తర్వాత మడతపెట్టి భద్రపరచాలి. పట్టుచీరలకు జరీ ఎక్కువగా ఉన్నప్పుడు చీరను తిరగవేసి ఆరేయ్యాలి. అలా చేస్తే జరీ ఊడకుండా ఉంటుంది. 
 
మడత పెట్టేటప్పుడు కూడా జరీలోపల పెట్టి మడత వేయాలి. నీళ్ళలో తడిపిన పట్టు చీరను ఎండలో ఆరేవేయకూడదు. అలా ఎండలో ఆరవేస్తే పట్టుచీర మీద మరో చీరను ఆరెయ్యడం మంచిది. పట్టుచీరను ఇస్త్రీ చేసేటప్పుడు కూడా మరో కాటన్ బట్టను వేసి చేయాలి. పట్టుచీరలను భద్రపరిచిన అరలో కలరా ఉండలను వేయాలి.