శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By IVR
Last Updated : శుక్రవారం, 4 జులై 2014 (17:12 IST)

రాత్రి 7 గంటలకు విశాఖ పోర్ట్ స్టేడియంలో కందుల సిస్టర్స్ భరత నాట్యం..

కందుల షాలిని, కందుల జాబిలి పేర్లు చెబితే చటుక్కున గుర్తుకు వచ్చేది భరతనాట్యం. ఈ ఇద్దరు సోదరీమణులు చేసే అద్భుత నాట్యానికి ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఈ సోదరీమణులు చేసిన అద్భుతమైన భరత నాట్యానికి శుభాంజలి నాట్య ధృమ పల్లవ అనే అవార్డును అందుకున్నారు.
 
అంతేకాదు ఈ అక్కచెల్లెళ్లిద్దరూ భరతనాట్యంలోని వివిధ రీతులను అమెరికా, కెనడాల్లో 3 గంటలపాటు ప్రదర్శించి చూపరులను మంత్రముగ్ధుల్ని చేశారు. కందుల సోదరీమణుల నాట్యానికిగాను వారు అభ్యసిస్తున్న శుభాంజలి పాఠశాల నాలుగుసార్లు అవార్డులను కైవసం చేసుకున్నది. 
 
ఇండో-అమెరికన్ వార్షిక ఉత్సవాల సందర్భంగా కందుల సోదరీమణులు చేసిన నాట్యాన్ని సుమారు 400 మంది అతిథిలు వీక్షించారు. చెన్నై నుంచి వచ్చిన వాయిద్యకారుల సహకారంతో ఆరోజు ఈ కార్యక్రమంగా ఆహుతులకు అనిర్వచనీయమైన అనుభూతిని మిగిల్చింది. కళలను ప్రోత్సహిస్తూ బాలికల్లో నిబిడీకృతమై ఉన్న ప్రతిభను వ్యక్తపరిచే అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న బి.ఆర్. రామప్రసాద్ గురు శుభ పర్మార్‌కు అభినందనలు తెలియజేయశారు.
 
షాలిని, జాబిలి తమ నృత్య ప్రదర్శనల ద్వారా వచ్చిన సొమ్మును సేవా సంస్థలకే అందజేయడం వారి దాతృత్వానికి ప్రతీక. బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ అనే సంస్థకు తాము ప్రదర్శించిన ఆయా ఈవెంట్ల ద్వారా సముపార్జించిన 5000 డాలర్లను సంస్థకు అందజేశారు. వీటి ద్వారా పాఠశాలలో కంప్యూటర్లు, తాగునీరు, ఫర్నీచర్ తదితరాలను సమకూర్చుతున్నారు. 
 
కందుల సోదరీమణులు జులై 4న అంటే ఈరోజు... విశాఖలోని అక్కయ్యపాలెం, పోర్ట్ స్టేడియం, కళావాణి ఆడిటోరియంలో భరతనాట్యం కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. అంగవికలురకు సాయం చేసే ఆశ్రాయధం స్పెషల్ స్కూల్ కు నిధులు సమకూర్చి పెట్టేందుకు గాను ఈ ఇరువురు సోదరీణులు తమ విద్యను ప్రదర్శించబోతున్నారు. తప్పక విచ్చేసి ఈ వేడుకలో పాలుపంచుకోవాలని కోరుతున్నారు నిర్వాహకులు.