మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : గురువారం, 1 నవంబరు 2018 (18:14 IST)

చర్మ సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు...

చర్మ రక్షణ కోసం చాలామంది తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఈ పొరబాట్ల వలన చర్మానికి హాని జరుగుతుంది. అలాకాకుండా ఉండాలంటే.. చర్మ రక్షణ కోసం కొన్ని చిట్కాలు పాటించాలి...
 
చర్మ సంరక్షణ కోసం రకరకాల క్రీములు వాటికి సంబంధించిన ఉత్పత్తుల్ని తరచుగా వాడడం చర్మ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇలాంటి ఉత్పత్తులను ఉపయోగిస్తే చర్మంపై దద్దుర్లు ఏర్పడి.. కందినట్లుగా మారుతుంది. అలానే మృతుకణాలు తొలగించేందుకు రకరకాల స్క్రబ్‌లు వాడుతుంటారు. ఈ స్క్రబ్స్ వాడితే చర్మం కాంతివంతంగా మారుతుంది.. కానీ, అదే పనిగా ఈ స్క్రబ్స్ వాడితే చర్మం పొడిబారుతుంది. 
 
చాలామంది ముఖంపై మెుటిమలు వచ్చినప్పుడు వాటిని గిల్లుతుంటారు. అలా గిల్లినప్పుడు ఆ మెుటిమలు పగిలి మచ్చలుగా మారిపోతాయి. అసలు మెుటిమలు ఎందుకోస్తాయంటే.. చేతుల్లో సూక్ష్మక్రిములు చేరడమే అందుకు కారణం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేతులతో మెుటిమలు గిల్లడం చర్మానికి అంత మంచిది కాదు. 
 
రోజూ ఓ కప్పు కాఫీ తాగడం చాలామందికి అలవాటు. అవసరానికి మించి ఎక్కువగా తాగడం అంత మంచిది కాదు. దానివలన చర్మం పొడిబారినట్లవుతుంది. దాంతో శరీరం తేమను కోల్వోతుంది. కాబట్టి కాఫీలు తగ్గించి నీరు, ఇతర ద్రవపదార్థాలు తీసుకోవడం మంచిది.