శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By Selvi
Last Updated : శనివారం, 7 మార్చి 2015 (18:17 IST)

వుమెన్స్ డే: మహిళలపై హింసలేని ప్రపంచం ఏర్పడాలని ఆశిద్దాం..!

వుమెన్స్ డే సందర్భంగా మహిళలపై హింసలేని ప్రపంచం ఏర్పడాలని ఆశిద్దాం. దేశంలో కాదు.. ప్రపంచ దేశాల్లో మహిళలపై ప్రస్తుతం హింస, అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోని, హింసలకు తావులేని మహిళా దినోత్సవం జరుపుకున్నప్పుడే వుమెన్స్ డేకే పూర్తి అర్థం లభించినట్లవుతుంది.
 
ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన ప్రపంచ దేశాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆచరిస్తారు. వివిధ ప్రాంతాల్లో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు, ప్రేమ దక్కేందుకు వీలుగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణించినా.. యాసిడ్ దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలతోనే మహిళలను హింసిస్తున్నారు. 
 
తొలుత అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలువబడిన ఈ మహిళా దినోత్సవం ప్రస్తుతం మదర్స్ డే, వాలెంటైన్ డే లాగా మారిపోయింది. ఇంకొన్ని ప్రాంతాల్లో ఐక్యరాజ్యసమితి ఉద్దేశించిన విధంగా మానవీయ హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా మహిళల రాజకీయ, సామాజిక హక్కుల పోరాటంపై జాగృతి పెంచే విధంగా జరుపుతున్నారు. 
 
మరి ఈ వుమెన్స్ డేకు పురుషులందరూ ఇళ్లల్లోనే కాదు.. బయటింటి ఆడపడచులకూ గౌరవం ఇవ్వాలి. భార్య మినహా అందరినీ సోదరీమణిగా భావించాలి. అప్పుడే మహిళలపై ఎలాంటి హింస చోటుచేసుకోని భారత దేశంగా రూపొందించ గలుగుతాం. ఈ శపథాన్ని వుమెన్స్ డే రోజునే  స్వీకరించండి. ఈ ప్రతిజ్ఞను స్వీకరిస్తారని ఆశిస్తున్నాం..