శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By సిహెచ్
Last Modified: శనివారం, 28 మే 2022 (15:40 IST)

ప్రపంచ ఋతుక్రమ దినోత్సవం 2022 ప్రధాన లక్ష్యాలు ఏమిటి?

world Menstruation Day 2022
మే 28ని ప్రపంచ ఋతుస్రావం దినోత్సవంగా జరుపుకుంటారు. రుతుక్రమ సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి, రుతుక్రమం సమయంలో మహిళలు ఎదుర్కొనే సామాజిక సమస్యలు, సవాళ్ల గురించి అవగాహన పెంచడానికి ఈ రోజు జరుపుకుంటారు. ఎంతమంది మహిళలకు శానిటరీ ఉత్పత్తులు, సంరక్షణ అందుబాటులో లేవని కూడా ఇది హైలైట్ చేస్తుంది.

 
ప్రపంచ ఋతుస్రావం దినోత్సవం 2022 యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటంటే... 
ప్రతిఒక్కరూ వారికి నచ్చిన ఋతుక్రమ ఉత్పత్తులను సరసమైన ధరలో పొందాలి.
పీరియడ్స్ పట్ల వున్న వ్యతిరేకమైన దృక్పధం, సామాజిక వివక్షను రూపుమాపాలి.
పురుషులు, అబ్బాయిలతో సహా ప్రతి ఒక్కరికి ఋతుస్రావం గురించి ప్రాథమిక సమాచారం ఉండాలి.
ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ఎక్కడైనా పీరియడ్-ఫ్రెండ్లీ నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత సౌకర్యాలను కలిగి ఉండాలి.

 
ప్రపంచ ఋతు పరిశుభ్రత దినోత్సవం 2022: చరిత్ర
2013లో జర్మన్ నాన్-ప్రాఫిట్ వాష్ యునైటెడ్ ద్వారా బహిష్టు పరిశుభ్రత దినోత్సవాన్ని రూపొందించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 2014లో జరుపుకుంది. అప్పటి నుండి జరుపుకుంటూ వున్నారు. గత మూడు సంవత్సరాలుగా, ప్రపంచ రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం ఉద్యమంలా నిర్వహిస్తూ ఋతు ఆరోగ్యం, పరిశుభ్రతపై చర్యలు తీసుకుంటున్నారు.