బుధవారం, 13 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-08-2024 గురువారం దినఫలాలు - సొంత నిర్ణయాల వల్ల కలహాలు, చికాకులు తప్పవు...

శ్రీ క్రోధినామ సం|| శ్రావణ శు॥ చవితి రా.9.51 ఉత్తర రా.10.10 వర్జ్యం లేదు. ఉ.దు. 9.58 ల 10.49 ప.దు. 3.05 ల 3.57
 
మేషం :- ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉండటం వల్ల పొదుపు సాధ్యం కాదు. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. దేని మీదా శ్రద్ధ వహించలేరు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం వంటి చికాకులు తప్పవు. సొంత నిర్ణయాల వల్ల కలహాలు, చికాకులు తప్పవు. దైవ కార్యక్రమాలపట్ల ఆసక్తి అధికమవుతుంది. 
 
వృషభం :- మీపై శకునాల ప్రభావం అధికమవుతుంది. మీపై బంధుమిత్రుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం అధికంగా ఉంటుంది. ఉద్యోగ, విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. ప్రముఖ సంస్థల షేర్ల కొనుగోళ్లు లాభిస్తాయి. చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి ఖాతాదారుల ఒత్తిడి తప్పదు. స్త్రీలు విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.
 
మిథునం :- ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలకు పొరుగువారి నుంచి ఆహ్వానం అందుతుంది. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ధనవ్యయం అధికమైనా ఇబ్బందులుండవు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
 
కర్కాటకం :- వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఊహించని ఖర్చులు, చెల్లింపుల వల్ల ఇబ్బందులు తప్పవు. మీ కదలికలపై నిఘా ఉందన్న విషయాన్ని గమనించండి. వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం.
 
సింహం :- వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యాపార రహస్యాలు, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. వ్యవహార జయం, ఆకస్మిక ధనలాభం వంటి శుభఫలితాలున్నాయి.
 
కన్య :- వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా కష్టపడాలి. ఎదుటివారు మిమ్ములను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడినా నిగ్రహించుకోవటం మంచిది. లక్ష్యసాధనలో స్వల్ప ఒడిదుడుకులు, చికాకులు ఎదుర్కుంటారు. కుటుంబీకుల కోసం ధనం బాగావ్యయం చేస్తారు. ఎల్.ఐ.సి, బ్యాంకు డిపాజిట్లకు సంబంధించిన సొమ్ము అందుకుంటారు.
 
తుల :- గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. స్త్రీలకు పొరుగువారి నుంచి ఆహ్వానం అందుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వ్యాపార, వ్యవహారాల్లో నిర్మొహమాటంగా వ్యవహరించండి. ఆత్మవిశ్వాసంతో మీ యత్నాలు సాగించండి. మీ సమస్యలు, చికాకులు క్రమంగా సర్దుకుంటాయి.
 
వృశ్చికం :- వ్యవసాయ రంగాల వారికి ఎరువుల కొనుగోలులో చికాకులు తప్పవు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. అద్దెలు, ఇతరత్రా రావలసిన బకాయిల వసూలులో దూకుడుగా వ్యవహరించకండి. సానుకూల ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు చుక్కెదురవుతుంది.
 
ధనస్సు :- పెద్దల గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారాల్లో నష్టాలను కొంత వరకు పూడ్చుకోగలుగుతారు. గత అనుభవాలు జ్ఞప్తికివస్తాయి. స్త్రీలతో మితంగా సంభాషించటం అన్ని విధాలా శ్రేయస్కరం. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. మీ ప్రయాణాలు, కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది.
 
మకరం :- ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత అవసరం. వ్యాపారాలు అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. దైవకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తుల సమర్థత, అంకితభావం అధికారులను ఆకట్టుకుంటాయి. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
 
కుంభం :- బంధువులు, సోదరీ సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ మాటకు ఇంటా బయటా గౌరవం లభిస్తుంది. ఏ వ్యక్తినీ తక్కువగా అంచనా వేయకండి. స్త్రీల పేరిట స్థిరాస్తులు కొనుగోలుచేస్తారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది.
 
మీనం :- ఉద్యోగస్తులకు విధినిర్వహణలో తోటివారి సహకారం లభిస్తుంది. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ప్రేమికులు అతిగా వ్యవహరించటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. గృహమార్పులకోసం యత్నాలు సాగిస్తారు.