'డోక లా' మాదే.. తేడా వస్తే యుద్ధమే : భారత్‌కు చైనా పరోక్ష వార్నింగ్
భారత్, చైనాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. సిక్కిం సెక్టార్‌లోని డోకా లా ప్రాంతం తమ భూభాగంలోనిదే అని గట్టిగా వాదిస్తోంది. ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెపుతోంది. పైగ
భారత్, చైనాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. సిక్కిం సెక్టార్‌లోని డోకా లా ప్రాంతం తమ భూభాగంలోనిదే అని గట్టిగా వాదిస్తోంది. ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెపుతోంది. పైగా, ఈ ప్రాంతం తమదేనని 1959లోనే నెహ్రూ అంగీకరించారని గుర్తుచేసింది. కాదుగీదని వాదిస్తే యుద్ధానికి సిద్ధమనే పరోక్ష సంకేతాలను పంపింది.
కానీ, భారత్ మాత్రం మరోలా వాదిస్తోంది. సిక్కిం సెక్టార్‌లోని డోకా లా ప్రాంతం భూటాన్ పరిధిలోకి వస్తుంది. అక్కడ చైనా సైన్యం రోడ్డు నిర్మించడమంటే ‘యథాతథ స్థితి’ని దెబ్బతీయడమేనని వ్యాఖ్యానిస్తోంది. అయితే, డోక లా ప్రాంతం తమదేనని... తమ భూభాగంలోకి చొరబడిన భారత సైనికులు వెనక్కి తగ్గాల్సిందేనని చైనా హెచ్చరించింది.
'సిక్కిం సెక్టార్‌లో భారత్-చైనా సరిహద్దులను స్పష్టంగా నిర్వచించారు. దీనిని ఇప్పటిదాకా భారత ప్రభుత్వాలన్నీ గౌరవించాయి. ఇప్పుడు అందుకు విరుద్ధంగా చైనా భూభాగంలోకి చొరబడి, మా కార్యకలాపాలను అడ్డుకోవడం విద్రోహానికి పాల్పడటమే' అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ అంటున్నారు.
'సిక్కిం సెక్టార్‌లో సరిహద్దులపై 1890లో బ్రిటన్, చైనా మధ్య ఒప్పందం కుదిరింది. దీనిని నెహ్రూ కూడా ఆమోదించారు. ఆ తర్వాత భారత ప్రభుత్వాలన్నీ దీనికి కట్టుబడి ఉన్నాయి' అని గెంగ్ షువాంగ్ తెలిపారు. ‘చరిత్రను చూసి పాఠాలు నేర్చుకోండి’ అంటూ పరోక్షంగా 1962 యుద్ధాన్ని చైనా గుర్తు చేసింది.