కానుకలతో స్పృహ తప్పిన స్థితిలో విద్యార్థిని.. 20 రోజుల పాటు అత్యాచారం..

Last Updated: మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (12:02 IST)
కన్యాకుమారి జిల్లాలో ఘోరం జరిగింది. ఓ విద్యార్థినిపై కామాంధులు విరుచుకుపడ్డారు. తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని కనిపించట్లేదని పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 20 రోజులకు తర్వాత కేరళలో కోని ప్రాంతంలో ఆ విద్యార్థినిని పోలీసులు కనుగొన్నారు. 
 
ఆ విద్యార్థిని చేతిలో కానుకలుండి స్పృహతప్పిన స్థితిలో పోలీసులు కనుగొన్నారు. ఆమె స్పృహలోకి వచ్చాక పోలీసులు జరిపిన విచారణలో రాజకుమార్ అనే వ్యక్తితో ఏడాది పాటు పరిచయం వుందని. రోజు తన వెంట పడుతూ.. కానుకలిస్తూ ప్రేమిస్తున్నానని చెప్పాడని.. తాను కూడా అతనిని ప్రేమించానని తెలిపింది. ఇలా ఓ రోజు స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా.. పెళ్లి చేసుకుందామన్నాడని, ఆపై కేరళలోని తన సొంతింటికి తీసుకెళ్తానని.. అక్కడ రాణిలా బతికిస్తానని నమ్మబలికాడని.. తాను అతని వెంట వెళ్లానని చెప్పింది. 
 
అయితే అక్కడ బాడుగ ఇంటికి తీసుకెళ్లి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. తర్వాత రాజకుమార్ చెప్పిందంటే అబద్ధమని తెలిసిందని.. వాపోయింది. తన నగలను అమ్మి ఖర్చు చేశాడని.. 20 రోజుల పాటు తనను ఆ గదిలో వుంచి అత్యాచారానికి పాల్పడేవాడని చెప్పింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని అరెస్ చేశారు.దీనిపై మరింత చదవండి :