బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. »
  3. తెలుగు వార్తలు
  4. »
  5. తెలుగు వార్తలు
Written By PNR

సర్వే తర్వాతే ప్రభుత్వం కూల్చివేత: జగన్ వ్యూహ రచన!!

కాంగ్రెస్ తిరుగుబాటు నేత, మాజీ ఎంపీ, దివంగత వైఎస్ఆర్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పరిస్థితులపై ఒక అధ్యయనం చేయిస్తున్నారు. ఈ సర్వేను తన సొంత మీడియా సాక్షి గ్రూపుతో పాటు ఒక జాతీయ సంస్థతో చేయిస్తున్నారు. ఇందులో తన సొంత పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (దాదాపుగా ఖరారు) పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించిన పక్షంలో ముఖ్యమంత్రి కేకేఆర్ ప్రభుత్వాన్ని కూల్చివేతకు వ్యూహరచన చేయాలని భావిస్తున్నారు.

అలాకాకుండా తన సొంత పార్టీపై ప్రజల నుంచి పెద్దగా స్పందన లేకుంటే మాత్రం మరో యేడాది పాటు వేచి చూసే ధోరణిని అవలంభించాలని భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కేకేఆర్ ప్రభుత్వం చేసే తప్పులు, తీసుకునే తప్పుడు నిర్ణయాలను ఎండగడుతూ ప్రజల మధ్యకు పాదయాత్ర ద్వారా వెళ్లే అంశాన్ని కూడా ఆయన పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా, ప్రస్తుతం చేపట్టిన ఓదార్పు యాత్ర తర్వాత జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టాలనే తలంపులో ఉన్నారు.