ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 4 జులై 2023 (18:28 IST)

తెలంగాణలో సమగ్ర క్యాన్సర్ కేంద్రంగా మారిన అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

image
అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్, వేరియన్ యొక్క అత్యంత అధునాతన ఉపరితల మార్గదర్శక వ్యవస్థ, ఐడెంటిఫై సాంకేతికతతో అనుసంధానించబడిన AI- ఆధారిత సంపూర్ణ పరిష్కారం ఎథోస్ రేడియోథెరపీ ని ప్రారంభించినట్లు వెల్లడించింది. క్యాన్సర్ చికిత్స రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా ఇది నిలువనుంది. ఈ విప్లవాత్మక సాంకేతికత వ్యవస్థను గౌరవ తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక, ఆరోగ్య, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి శ్రీ టి. హరీష్ రావు ఘనంగా ప్రారంభించారు.

AI-ఆధారిత ఎథోస్ రేడియోథెరపీని అందుబాటులోకి తీసుకురావటంతో, AOI క్యాన్సర్ సంరక్షణలో నూతన ప్రమాణాలను నిర్దేశించింది, తెలంగాణ మరియు వెలుపల ఉన్న రోగులకు అత్యాధునిక సాంకేతికత మరియు వ్యక్తిగతీకరించిన చికిత్స అవకాశాలను అందిస్తోంది. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే శ్రీ ఆరెకపూడి గాంధీ, ఆందోల్ ఎమ్మెల్యే శ్రీ క్రాంతి కిరణ్ చంటి, సిద్దిపేట ఎమ్మెల్యే శ్రీ ఎర్రోళ్ల శ్రీనివాస్, శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ నాగేందర్ యాదవ్, మాదాపూర్ కార్పొరేటర్ శ్రీ జగదీశ్వర్ గౌడ్,  చందా నగర్  కార్పొరేటర్ శ్రీ మంజుల రఘునాథ్ రెడ్డి, భారతి నగర్, కార్పొరేటర్ శ్రీ సింధు ఆదర్శ్ రెడ్డి, CTSI-సౌత్ ఏషియా సీఈఓ హరీష్ త్రివేది మరియు AOI రీజనల్ COO డాక్టర్ ప్రభాకర్ పి. కూడా పాల్గొన్నారు.