సూపర్ ఇంటరెస్టింగ్... 'ఎన్టీఆర్ బయోపిక్'లో చిరంజీవి?

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం గురించి ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటయా అంటే... ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటిస్తున్నారన్న సంగతి. మెగాస్టార్ చిరంజీవి కెరీరో తొలినాళ్లలో ఎన్టీఆర్ ఎంతో స్నేహపూర్వకంగా వుండేవారనీ, ఆ సంగతులను తెరకెక్కించనున

Chiru
ivr| Last Modified శనివారం, 11 ఆగస్టు 2018 (22:32 IST)
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం గురించి ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటయా అంటే... ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటిస్తున్నారన్న సంగతి. మెగాస్టార్ చిరంజీవి కెరీరో తొలినాళ్లలో ఎన్టీఆర్ ఎంతో స్నేహపూర్వకంగా వుండేవారనీ, ఆ సంగతులను తెరకెక్కించనున్నారనే వార్త వస్తోంది. మరోవైపు చిత్రం షూటింగ్ శరవేగంగా జ‌రుపుకుంటోంది. 
 
క్రిష్ తెర‌కెక్కిస్తోన్న ఈ మూవీపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. నందమూరి నటసింహం బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు ఎన్టీఆర్ పాత్రను పోషిస్తున్నారు. వారాహి అధినేత సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి కూడా ఈ చిత్రానికి నిర్మాతలు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విద్యాబాలన్, ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
నారా చంద్రబాబునాయుడు పాత్ర కోసం రానాని, అక్కినేని నాగేశ్వరరావు పాత్ర కోసం సుమంత్‌ని తీసుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో సీనియ‌ర్ న‌టి న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆమె ఎవ‌రో కాదు ఆమ‌ని. ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి స్థానం గురించి కూడా కొన్ని సీన్స్ ఉన్నాయ‌ట‌. ఆ పాత్ర‌కు ఆమె క‌రెక్ట్‌గా స‌రిపోతుంద‌ని  ఆమనిని సంప్రదించారట. 
 
తొలుత లక్ష్మీపార్వతి ప్రస్థావన ఉండదనే వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు లక్ష్మీపార్వతి పాత్ర కోసం ఆమనిని తీసుకున్నారనే వార్తలు రావడంతో క్రిష్ ఆ పాత్ర‌ను ఎలా చూపిస్తార‌నే ఆస‌క్తి ఏర్ప‌డింది. 
 
మరోవైపు అక్కినేని పాత్ర‌ను నాగచైత‌న్య చేయ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌ర్వాత నాగచైత‌న్య కాదు.. సుమంత్ చేస్తున్నాడ‌ని టాక్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఎవ‌రో కొత్త ఆర్టిస్ట్ అక్కినేని పోషించ‌నున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఇక ఈ ప్ర‌చారాల‌కు ఫుల్‌స్టాఫ్ పెడుతూ... ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో అక్కినేని పాత్ర‌ను పోషిస్తున్న‌ట్టు సుమంత్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసాడు. చైతు అక్కినేనిగా న‌టిస్తే ఎలా ఉంటుందో చూసాం. ఇక సుమంత్ అక్కినేనిగా ఎలా ఉంటారో చూడాలి. మొత్తమ్మీద ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటులు నటిస్తుండటంతో బాగా హైప్ పెరుగుతోంది.దీనిపై మరింత చదవండి :