మంగళవారం, 19 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 29 జులై 2022 (16:10 IST)

గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంట‌గా ఆకాశ వీధుల్లో

Gautham Krishna, Poojita Ponnada
Gautham Krishna, Poojita Ponnada
గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జి కె ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై గౌతమ్ కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ''ఆకాశ వీధుల్లో''. మనోజ్ డి జె, డా. మణికంఠ నిర్మాతలు. ప్రేమ‌క‌థ‌లో స‌రికొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం విడుదల తేది ఖరారైయింది. సెప్టెంబర్ 2 ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
 
దేవి ప్రసాద్, బాల పరాశర్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షిత గౌర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జూడా శాండీ సంగీతం అందిస్తుండగా,  విశ్వనాధ్ రెడ్డి సినిమాటోగ్రఫర్.
 
నటీనటులు : గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ, దేవి ప్రసాద్, బాల పరాశర్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షిత గౌర్ తదితరులు ..
సంగీతం : జూడా శాండీ,
కెమెరా : విశ్వనాధ్ రెడ్డి,
ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్,
సౌండ్ మిక్సింగ్ : కన్నన్ గణపతి,
నిర్మాతలు : మనోజ్ జెడి , డా. డీజే మణికంఠ
రచన, దర్శకత్వం : గౌతమ్ కృష్ణ