భజే వాయు వేగంతో కెరీర్ లో బలమైన ముందడుగు పడుతుంది: హీరో కార్తికేయ
Karthikeya Gummakonda Aishwarya Menon
యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా "భజే వాయు వేగం". ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ నెల 31న "భజే వాయు వేగం" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేస్తోంది. ఈ రోజు "భజే వాయు వేగం" ట్రైలర్ ను హైదరాబాద్ ఐమాక్స్ లో ఘనంగా రిలీజ్ చేశారు.
హీరోయిన్ ఐశ్వర్య మీనన్ మాట్లాడుతూ - మా భజే వాయు వేగం సినిమా ట్రైలర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ నెల 31న రిలీజయ్యే సినిమా కూడా అలాగే నచ్చుతుంది. స్పై సినిమా కంటే ముందు నేను సైన్ చేసిన చిత్రమిది. దర్శకుడు ప్రశాంత్, యూవీ ప్రొడక్షన్స్ కు థ్యాంక్స్. ఈ సినిమా మా టీమ్ అందరికీ మిరాకిల్స్ చేయాలి. హీరో కార్తికేయతో కలిసి నటించడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. అతను లవ్ లీ కోస్టార్. భజే వాయు వేగం సినిమాను తప్పకుండా చూడండి. అన్నారు
హీరో కార్తికేయ మాట్లాడుతూ - నేను ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో కథ విన్నప్పటి నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతుందా మూవీ అని ఎక్కువగా ఎదురుచూసింది భజే వాయు వేగం సినిమాకే. నేను ఎలాంటి కథ చేద్దామని అనుకున్నానో, నా సినిమాలో ఎలాంటి ఎమోషన్, ఎలాంటి డ్రామా ఉండాలని అనుకున్నానో, ఎలాంటి క్యారెక్టర్ పోషించాలని అనుకున్నానో..అవన్నీ వందశాతం కుదిరిన సినిమా ఇది. నాకు పర్పెక్ట్ మూవీని డైరెక్టర్ ప్రశాంత్, మిగతా టీమ్ డిజైన్ చేశారు. నా కెరీర్ మొదలై ఆరేళ్లవుతోంది. ఎనిమిది తొమ్మిది సినిమాల్లో నటించాను. వాటిలో కొన్ని హిట్ అయ్యాయి, మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. లాస్ట్ మూవీ బెదురులంక బాగా పే చేసింది. ఒక పర్పెక్ట్ మూవీతో నా అడుగు ముందుకు పడలేదని అనిపిస్తుంటుంది. ఆ వెలితిని భజే వాయు వేగం తీరుస్తుంది. కమర్షియల్ సినిమాలో ఇవి ఉండాలని కావాలని పెట్టిన సినిమా కాదిది. కథకు ఏం కావాలో అదే చేసుకుంటూ వెళ్లాం. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ కథలో సహజంగా కుదిరాయి. సినిమా చూస్తున్న వాళ్లు కథలో లీనమవుతారు. ఆ ఎమోషనల్ డ్రైవ్ నుంచే ప్రతి ఒక్క అంశాన్ని అనుభూతి చెందుతారు. కథలోని లవ్, ఎమోషన్, యాక్షన్, డ్రామా వంటివన్నీ డైరెక్ట్ గా మీ మనసును తాకుతాయి. మా మూవీకి వచ్చే క్రెడిట్, మేమింత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నామంటే కారణం దర్శకుడు ప్రశాంత్ కే దక్కుతుంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చేవారంతా ఒక ప్యాషన్ తో వస్తారు. చేసే పనిలో సంతృప్తి వెతుక్కుంటారు. మా టీమ్ అందరికీ అలాంటి వెలకట్టలేని సంతృప్తినిచ్చిన సినిమా భజే వాయు వేగం. మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ ఈ సినిమా బెటర్ గా వచ్చేలా తమ ఎఫర్ట్స్ పెట్టారు. హీరోయిన్ ఐశ్వర్య పర్ ఫార్మెన్స్ కు మంచి పేరొస్తుంది. రాహుల్ టైసన్ కీ రోల్ చేశాడు. తనికెళ్ల భరణి గారి పాత్రకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. ఆర్ఎక్స్ 100 తర్వాత నాకు భజే వాయు వేగం మరో బెంచ్ మార్క్ మూవీ అవుతుంది. మా మూవీ టీజర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా థ్యాంక్స్. అన్నారు.
డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ - భజే వాయు వేగం ఒక మంచి ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. మా మూవీ గురించి డీటెయిల్డ్ గా తర్వాత మాట్లాడుతాను. యూవీ సంస్థలో పదేళ్లుగా ట్రావెల్ చేస్తున్నా. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ప్రాజెక్ట్ ఒప్పుకున్న హీరో కార్తికేయకు కృతజ్ఞతలు. టీజర్, ట్రైలర్ లో హీరోయిన్ ఐశ్వర్య మీనన్ సీన్స్ ఎక్కువ రివీల్ చేయలేదు. ఎందుకంటే ఆమె ఉన్న సీన్స్ చాలా కీలకంగా ఉంటాయి. అవి రివీల్ చేస్తే కథలో ట్విస్ట్ తెలుస్తుందని అనుకున్నాం. సినిమాలో మాత్రం ఐశ్వర్య పర్ ఫార్మెన్స్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద చాలా టైమ్ స్పెండ్ చేశాను. రేపు థియేటర్ లో మీకు ఆ ఎక్సీపిరియన్స్ తెలుస్తుంది. మార్చిలో మా మూవీ రిలీజ్ చేయాలని అనుకున్నాం. ఐపీఎల్, పరీక్షలు ఇలాంటి వాటిలో ప్రేక్షకులు బిజీగా ఉంటారని రెండు నెలలు ఆగి రిలీజ్ చేస్తున్నాం. రియల్ ఇన్సిడెంట్స్ తో బేస్ అయిన సినిమా కాదిది. కానీ మనం ఎక్కడో చదివిన విషయాల ఇంపాక్ట్ కథలో ఉంది. ఒక కామన్ మ్యాన్ అసాధారణ సమస్యలో ఇరుక్కుంటే అందులో నుంచి ఎలా బయటపడ్డాడు అనేది అన్ని ఎమోషన్స్ కలిపి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో చూపిస్తున్నాం. అన్నారు.
డైలాగ్ రైటర్ మధు శ్రీనివాస్ మాట్లాడుతూ - భజే వాయు వేగం ట్రైలర్ చూస్తే మీరంతా ఈ సినిమా క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ అనుకుంటారు. సినిమా చూస్తే ఇందులో మిగతా అనేక అంశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఫాదర్ సన్ రిలేషన్, ఒక మంచి లవ్ స్టోరి. బ్రదర్స్ మధ్య బాండింగ్ ..వంటి ఎమోషన్స్ తో కథ సాగుతుంది. అసాధారణమైన క్రైమ్ బ్యాక్ గ్రౌండ్ లో నడిచే యాక్షన్ ప్యాకేజి ఈ సినిమా. భజే వాయు వేగం చిత్రంలో నేను పార్ట్ అయినందుకు హ్యాపీగా ఫీలవుతున్నా. అందుకు యూవీ వారికి, హీరో కార్తికేయ, దర్శకుడు ప్రశాంత్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.