గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (10:41 IST)

జనసేనలోకి ఎస్పీవై రెడ్డి.. ఒకే ఫ్యామిలీ నుంచి నాలుగు టిక్కెట్లు

జనసేన పార్టీలోకి ఎస్పీవై రెడ్డి చేరిపోయారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో అత్యంత కీలకపాత్ర పోషించే ఎస్పీవై రెడ్డికి తెలుగుదేశం పార్టీ టిక్కెట్ నిరాకరించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో నంద్యాల లోక్‌సభ అభ్యర్థిగా ఎస్పీవై రెడ్డి పేరును జనసేన ఖరారు చేసింది. 
 
అంతేనా... మూడు అసెంబ్లీ స్థానాలకు ఎస్పీవై రెడ్డి కుటుంబసభ్యులు పోటీ చేస్తున్నారు. నంద్యాల ఎంపీగా ఎస్పీవై రెడ్డి బరిలోకి దిగుతుంటే, ఆయన చిన్న కుమార్తె అరవిందరాణి బనగానపల్లి శాసనసభ అభ్యర్థిగా, పెద్ద అల్లుడు సజ్జల శ్రీధర్‌ రెడ్డి నంద్యాల శాసనసభ స్థానంలో పోటీ చేస్తున్నారు. సాధారణంగా ఒక ఫ్యామిలీ నుంచి ఒకరు లేదా ఇద్దరికి టిక్కెట్స్ కేటాయిస్తారు. కానీ, జనసేన మాత్రం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి టిక్కెట్లు కేటాయించి రికార్డు సృష్టించింది.