మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : ఆదివారం, 7 ఏప్రియల్ 2019 (11:37 IST)

జగన్ పార్టీకి 130 సీట్లు ఖాయం : అసదుద్దీన్ ఓవైసీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాకు 130 సీట్లు ఖాయమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చెప్పుకొచ్చారు. ఈనెల 11వ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఆయా పార్టీల నేతలు బిజీగా గడుపుతున్నారు. 
 
కాగా ఇప్పటికే ఏపీలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనేది కొన్ని సర్వేలు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం విషయంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆస్తక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి 20కి పైగా ఎంపీ సీట్లు, 130కి పైగా ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటారని అసదుద్దీన్‌ ఒవైసీ జోస్యం చెప్పారు.
 
ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలవడం ఓ చారిత్రక అవసరమన్నారు. చంద్రబాబు అంటే ఏపీ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, ఐదేళ్ళ కాలంలో రాష్ట్ర ప్రజలను అన్నవిధాలుగా మోసం చేశారన్నారు. ముస్లింలకు చంద్రబాబు చేసినంత అన్యాయం మరెవ్వరూ చేయలేదని ఒవైసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 
 
నాలుగేళ్లపాటు బీజేపీతో సంసారం చేసి ఇప్పుడు రాజకీయ అవసరం కోసం బీజేపీని తిడుతున్నారని మండిపడ్డారు. బీజేపీతో చంద్రబాబు రెండుసార్లు పొత్తు పెట్టుకుని, వైఎస్‌ జగన్‌కి, మోడీకి పొత్తు ఉందని విషప్రచారం ఒవైసీ విమర్శించారు. చంద్రబాబును ముస్లింలు ఎప్పటికీ నమ్మరని, ఆయన పచ్చి రాజకీయ అవకాశవాది అని విమర్శలు గుప్పించారు.