శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 23 నవంబరు 2024 (16:37 IST)

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

image
మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఏఓఐ) రొమ్ము మరియు గర్భాశయం రెండింటినీ ప్రభావితం చేసే అరుదైన సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌‌తో బాధపడుతున్న 61 ఏళ్ల శ్రీమతి వివిఎస్‌కి విజయవంతంగా చికిత్స అందించింది. ఈ సంక్లిష్టమైన కేసుకు చికిత్స అందించటం కోసం డాక్టర్ ఎన్ సుబ్బా రావు, డాక్టర్ కళ్యాణ్ పోలవరపు, డాక్టర్ ఎస్ మణికుమార్ నేతృత్వంలోని బృందం, అంతర్జాతీయ ట్యూమర్ బోర్డుతో సంప్రదింపులతో పాటు సమగ్రమైన, బహుళ అంచెల చికిత్సా విధానం అనుసరించింది. 
 
శ్రీమతి వివిఎస్ అసాధారణ రక్తస్రావం యొక్క లక్షణాలతో హాస్పిటల్‌కు వచ్చారు. ఆమెకు పరీక్షలు నిర్వహించగా గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణకు దారితీసింది. తదుపరి పరీక్షలలో ఎడమ ఆక్సిలరీ లింఫ్ నోడ్లలో క్యాన్సర్ కణాలు ఉన్నట్లు వెల్లడి అయింది. ఆక్సిలరీ లింఫ్ నోడ్ బయాప్సీ ద్వారా ఆమెకు రొమ్ము, గర్భాశయం రెండింటిలోనూ క్యాన్సర్ ఉందని నిర్ధారించారు, ఈ పరిస్థితిని సింక్రోనస్ డ్యూయల్ ప్రైమరీ మాలిగ్నన్సీ అంటారు. క్యాన్సర్ రోగులలో సింక్రోనస్ మాలిగ్నన్సీ అరుదుగా ఉండటం వలన ప్రత్యేక చికిత్స ప్రోటోకాల్ రూపొందించబడింది.
 
రోగి యొక్క చికిత్స ప్రణాళికలో నియోఅడ్జువాంట్ కెమోథెరపీ, కణితులను కుదించడానికి టార్గెటెడ్ థెరపీ, తర్వాత గర్భాశయం, రొమ్ము కణజాలాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స అనంతరం ఛాతికి అద్జువెంట్ రేడియోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ నిర్వహించబడింది. ఈ కఠినమైన చికిత్స ప్రోటోకాల్‌ను అనుసరించి, శ్రీమతి వివిఎస్  తన చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు  మరియు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు.
 
"ఇలాంటి కేసులు బహుళ క్యాన్సర్‌లకు చికిత్స చేయడంలో ఉన్న ఇబ్బందులను వెల్లడిస్తాయి. అధునాతన, పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అందించడంలో మా అంకితభావాన్ని ప్రదర్శిస్తాయి" అని సిటీ ఎస్ఐ -దక్షిణాసియా సీఈఓ హరీష్ త్రివేది అన్నారు. "ఈ కేసు లో విజయవంతమైన చికిత్స, టార్గెటెడ్ థెరపీ యొక్క కీలక పాత్రను, మల్టీడిసిప్లినరీ విధానాన్ని నొక్కి చెబుతుంది. అత్యంత అనుభవజ్ఞులైన వైద్యులు, అత్యాధునిక చికిత్స ఎంపికలను ఏఓఐ కలిగి ఉంది, మేము చాలా సవాలుగా ఉన్న కేసులను కూడా పరిష్కరించడానికి బాగా సిద్ధంగా ఉన్నామని నిర్ధారిస్తుంది. ఆవిష్కరణ, సమగ్రమైన చికిత్స పట్ల మా నిబద్ధత సంక్లిష్ట క్యాన్సర్ నిర్ధారణలను ఎదుర్కొంటున్న రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాలను అందించడానికి, వారికి మెరుగైన జీవన నాణ్యతను సాధించడంలో సహాయపడుతుంది" అని అన్నారు.
 
ఏఓఐ యొక్క ఆర్ సిఓఓ మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ, “సింక్రోనస్ క్యాన్సర్స్ అరుదుగా కనిపిస్తాయి, ముఖ్యంగా రొమ్ము- గర్భాశయం రెండింటినీ ప్రభావితం చేస్తుంది, ఇది ప్రత్యేకమైన సవాళ్లను అందిస్తుంది. ఏఓఐ వద్ద, మేము అటువంటి కేసులను సమర్థవంతంగా చికిత్స అందించటానికి అంతర్జాతీయ నైపుణ్యం, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటాము, మా రోగుల మనుగడ మరియు జీవన నాణ్యత రెండింటికి ప్రాధాన్యతనిస్తాము.." అని అన్నారు. 
 
ఏఓఐ మంగళగిరికి చెందిన సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కళ్యాణ్ పోలవరపు మాట్లాడుతూ, “రొమ్ము- ఎండోమెట్రియల్ క్యాన్సర్‌లు ఒక్కొక్కటిగా ప్రబలంగా ఉన్నప్పటికీ, ఒకే రోగిలో రెండూ ఒకేసారి సంభవించడం చాలా అరుదు. ఈ ప్రత్యేక పరిస్థితి గణనీయమైన సవాళ్లను విసిరింది, అయితే సత్వర రోగ నిర్ధారణ మరియు పూర్తి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ప్రణాళికతో, మేము రెండు క్యాన్సర్‌లకు ఒకే సమయంలో సమర్థవంతంగా చికిత్స అందించగలిగాము. సర్జికల్ ఆంకాలజీ, కీమోథెరపీ, రేడియేషన్‌లలో తాజా పురోగతులను ఏకీకృతం చేసిన మా మల్టీడిసిప్లినరీ విధానం ఈ సంక్లిష్ట కేసుకు చికిత్స చేయటంలో కీలకమైనది. రోగి యొక్క విజయవంతమైన రికవరీ ఆధునిక ఆంకాలజీ యొక్క విశేషమైన అవకాశాలను వెల్లడిస్తుంది, ఇక్కడ అత్యంత సంక్లిష్టమైన పరిస్థితులలో కూడా ప్రత్యేకంగా ప్రణాళిక చేసిన చికిత్సలు మరియు నిపుణుల సంరక్షణ జీవితాన్ని మార్చగల మార్పును కలిగిస్తుంది" అని అన్నారు.