బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 ఏప్రియల్ 2024 (09:17 IST)

విశాఖ ఉత్తరం అసెంబ్లీ స్థానం నుంచి లక్ష్మీనారాయణ పోటీ!!

laxminarayana
జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీ నారాయణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆయన విశాఖపట్టణం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ దఫా మాత్రం ఆయన విశాఖ ఉత్తరం అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. అలాగే, తమ పార్టీ ఏపీలో 6 లోక్‌సభ, 48 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని ఆయన ప్రటించారు. అలాగే, తెలంగాణ రాష్ట్రంలో మూడు లోక్‌సభ సీట్లలో పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. ఉగాది నాటికి అన్ని స్థనాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తామని తెలిపారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరకు, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు, హిందూపురం స్థానాలతో పాటు తెలంగాణాలోని మెదక్, మల్కాజి‌గిరి, నాగర్ కర్నూలు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థలను ప్రకటించారు. ఇక తాను విశాఖ ఉత్తర అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని తెలిపారు. అలాగే, విశాఖ పశ్చిమం నుంచి వెంకట గణేష్, భీమిలి నుంచి ఎలిపిల్లి అనిల్ కుమార్‌లను బరిలోకి దించుతున్నట్టు తెలిపారు.