1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 22 మే 2024 (19:51 IST)

అదే ముద్రగడ పద్మనాభం పరువు తీసేలా వుంది, ఫోన్ చేస్తే వైసిపి నాయకులు లిఫ్ట్ చేయడంలేదట?!!

Mudragada-pawan
గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక రెండుచోట్ల ఓడిపోయారు. ఐనా ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా ప్రజా సమస్యలపై పోరాటం చేసారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సాగారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎక్కడ పోటీ చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోక ముందే ముద్రగడ పద్మనాభం ఓ సవాల్ విసిరారు. ధైర్యం వుంటే.... పిఠాపురంలో పోటీ చేసి విజయం సాధించాలనీ, అలా విజయం సాధిస్తే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానండి అంటూ ఛాలెంజ్ చేసారు. ఇప్పుడిదే ఆయన పరువు తీసేలా వున్నదని అంటున్నారు.
 
ఎందుకంటే.... ఏ సర్వే తీసుకున్నా పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం తథ్యం అని చెబుతున్నాయట. అంతేకాదు.. ఎన్నికల సమయంలో కన్నకూతురే ముద్రగడ నిర్ణయం సరైంది కాదనీ, తాము పవన్ కల్యాణ్ గారికి మద్దతు ఇస్తున్నామంటూ బహిరంగంగా చెప్పారు. అప్పటికి కూడా ముద్రగడ వెనక్కి తగ్గలేదు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను చిత్తుచిత్తుగా ఓడించాలని కాపు సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నానంటూ చెప్పారు. కానీ సీన్ రివర్స్ అయిందని అంటున్నారు.
 
అధికార పార్టీ నుంచి ముద్రగడకు ఆశించిన స్థాయిలో స్పందన వుండటంలేదనీ, కనీసం ఫోన్లు చేసినప్పటికీ క్యాడర్ అస్సలు పట్టించుకోవడం లేదని సమాచారం. ఈ పరిణామాల నేపధ్యంలో జూన్ 4న వెలువడే ఫలితాలలో పవన్ గెలిస్తే... అంతా తనను పద్మనాభ రెడ్డి అని గేలి చేస్తారేమోనన్న బాధలో వున్నట్లు చెప్పుకుంటున్నారు.