Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రైలు జనరల్ బోగీలో స్టౌవ్‌లో కోట్ల రూపాయల విలువ చేసే బంగారం... నెల్లూరులో....

సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (20:23 IST)

Widgets Magazine
gold biscuit

నెల్లూరు జిల్లాలోని రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. గౌహతి నుంచి చెన్నైకి వెళుతున్న రైలులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఒక ప్రయాణికుడు కనిపించాడు. అది కూడా జనరల్ బోగీలో ఏమీ ఎరుగనట్లు ఒక అల్యూమినియం స్టౌవ్ పట్టుకుని, తలపైన సామాన్లు ఉంచుకుని నిలబడ్డాడు ఆ ప్రయాణీకుడు. ఇంటి సామానుగా భావించి రైల్వే పోలీసులు కొద్దిసేపు పట్టించుకోలేదు. అయితే జనరల్ బోగీ ఖాళీగా ఉన్నా ఆ వ్యక్తి లగేజ్‌ను కింద పెట్టకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.
 
సామాన్లతో పాటు స్టౌవ్‌ను పరిశీలించారు రైల్వే పోలీసులు. అల్యూమినియం స్టౌవ్‌లో ఒకటిన్నర కోటి విలువైన బంగారం బయటపడింది. అది కూడా 5 కిలోల బంగారం. గౌహతి నుంచి చెన్నైకు ఈ బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. వెంటనే కస్టమ్స్ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఆ ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకొని 1962 కస్టమ్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు డిఆర్ఐ అధికారులు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పనిమనిషిలా చేరుతుంది... యజమానులను పెళ్ళిచేసుకుంటుంది.. ఆ తరువాత?

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వివాహాలు చేసుకుందో మహిళ. జల్సాలకు అలవాటుపడి, భర్త ...

news

కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్... ఏంటది?

‘‘ఈ బడ్జెట్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు జరపలేదు. అయినా మన సమర్థత ...

news

శ్రీకాళహస్తిలో 'శివగామి'.. అక్కడ ఆమె మాటే శాసనం... ఎవరో తెలుసా?

ఆ అధికారి రూటే సపరేటు. అక్కడ ఆమె చెప్పిందే వేదం. ఆమె మాట వినకపోతే అంతేసంగతులు. ...

news

ప్రధానిపై సినీ నటి, ఎంపీ దివ్య సెటైర్లు.. రాహుల్ గాంధీ సైలెంట్‌గా వుంటారా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సినీ నటి, కాంగ్రెస్ ఎంపీ దివ్య స్పందన ట్విట్టర్లో సెటైర్లు ...

Widgets Magazine