సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 17 సెప్టెంబరు 2018 (16:16 IST)

గరుడ సేవకు సర్వం సిద్ధం - తిరుమలకు చేరుకున్న 5 లక్షల మంది భక్తులు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడసేవకు సర్వం సిద్ధమైంది. రాత్రికి గరుడ వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. గరుత్మంతుడిపై స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. ప్రతి యేటా గరుడ వాహన సేవకు 5 లక్షల మంది భక్తులు తిర

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడసేవకు సర్వం సిద్ధమైంది. రాత్రికి గరుడ వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. గరుత్మంతుడిపై స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. ప్రతి యేటా గరుడ వాహన సేవకు 5 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారు. ఈ యేడాది అదేవిధంగా 5 లక్షల మందికి పైగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు.
 
తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. ఇసుకేస్తే రాలనంత జనంలా మారిపోయాయి తిరుమల గిరులు. ఏ మూలన చూసినా గోవింద నామస్మరణలే వినిపిస్తున్నాయి. గ్యాలరీలన్నీ ఇప్పటికే నిండిపోయాయి. మాడ వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతోంది. పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను తిరుమలకు అనుమతిస్తున్నారు. ద్విచక్ర వాహనాలను పూర్తిగా తిరుమలకు నిలిపేశారు. కార్లు, బస్సులలో మాత్రమే తిరుమలకు భక్తులను అనుమతిస్తున్నారు.