1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 ఏప్రియల్ 2021 (12:15 IST)

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం.. 60మంది ఉద్యోగులకు కోవిడ్.. అసిస్టెంట్‌ సెక్రటరీ మృతి

ఏపీ సచివాలయంలో ఉద్యోగుల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే 60 మంది ఉద్యోగులకు కోవిడ్ సోకింది. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. ఇప్పటికే ఆర్థికశాఖలో అసిస్టెంట్‌ సెక్రటరీగా పని చేసిన పద్మారావు మృతి చెందారు. 
 
నిన్న సచివాలయంలో 200 మందికి కరోనా పరీక్షలు నిర్వహిచారు. వారి రిజల్ట్స్ రావాల్సి ఉంది అయితే కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం నిర్వహించాలని కోరుతున్నారు. 
 
ఉద్యోగుల కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది.  కరోనాతో మృతి చెందిన పద్మారావు భార్య కూడా సచివాలయంలోనే పనిచేస్తున్నారు. ఆమెకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. 
 
ఒకరిద్దరు ఐఎఎస్ అధికారులకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో శాఖాధిపతులు (హెచ్ఓడీలు) ఎవరూ సచివాలయానికి రావడం లేదు. హెచ్ఓడీలు విజయవాడ, గుంటూరుల్లోని తమ కార్యాలయాల నుంచే పనిచేస్తున్నారు.